ETV Bharat / city

సెప్టెంబరు నాటికి పిల్లలకూ టీకా! - latest update on Vaccine for children

దేశంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడిన అందరికీ కొవిడ్‌ టీకా వేస్తున్నారని.. వైరస్‌లో వేరియంట్లు మారుతున్న కొద్దీ పిల్లలపై ప్రభావం పెరుగుతోందని ప్రఖ్యాత టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ వ్యాపారాభివృద్ధి విభాగాధిపతి డా.రేచస్‌ ఎల్లా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి పిల్లల మీద టీకా పరీక్షలు (పీడియాట్రిక్‌ ట్రయల్స్‌) మొదలు పెట్టబోతున్నామని చెప్పారు. సెప్టెంబరు చివరి నాటికి 18 సంవత్సరాల లోపు వారికీ టీకా అందుబాటులోకి రావొచ్చని అన్నారు. అది కేంద్ర ప్రభుత్వ అనుమతులపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి 70 కోట్ల కొవాగ్జిన్‌ టీకా డోసులు ఉత్పత్తి చేస్తామన్నారు. తయారీ యూనిట్లను బెంగళూరు, గుజరాత్‌కు విస్తరించనున్నట్టు తెలిపారు. శనివారం ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించిన చర్చలో డాక్టర్‌ రేచస్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రముఖ ఆంకాలజిస్ట్‌ ప్రజ్ఞ చిగురుపాటి వక్తగా, ఎఫ్‌ఎల్‌వో అధ్యక్షురాలు ఉమా చిగురుపాటి నేతృత్వం వహించారు. టీకా తయారీ మొదటి రోజు నుంచి ఎదురైన సవాళ్లు, ప్రజల్లో సందేహాలు, వ్యాక్సిన్‌ పనితీరు గురించి ఆయన వివరించారు.

సెప్టెంబరు నాటికి పిల్లలకూ టీకా!
సెప్టెంబరు నాటికి పిల్లలకూ టీకా!
author img

By

Published : May 23, 2021, 10:53 AM IST

దేశంలో తొలి కొవిడ్‌ కేసు నమోదైన నాటి నుంచే పరిశోధనలు మొదలయ్యాయి. పరిశోధనల కోసం పుణేలోని వైరాలజీ ల్యాబ్‌ నుంచి నమూనాల్ని రోడ్డు మార్గంలో కార్లోనే శామీర్‌పేటలోని జీనోమ్‌ వ్యాలీకి తెచ్చాం. ఆరోజు నుంచి ల్యాబ్‌లో పరీక్షలు మొదలయ్యాయి. అక్కడ బయటి వాతావరణంలో గాలి కూడా పీల్చలేని పరిస్థితులుంటాయి. శాస్త్రవేత్తలు ఆక్సిజన్‌ సిలిండర్లు పెట్టుకొని గంటల తరబడి పనిచేశారు. ఏ టీకా అయినా బయటకు రావడానికి కనీసం 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది. కొవాగ్జిన్‌ టీకాను ఏడాది లోపే తెచ్చాం. టీకా విషయంలో ఏ దేశ పౌరులు అనేది మేమెప్పుడూ చూడలేదు. ఏ వ్యాక్సిన్‌ అయినా అంతర్జాతీయ పౌరుల్ని దృష్టిలో పెట్టుకునే తయారీ, ఉత్పత్తి సాగుతుంది.

ఆన్​లైన్​ చర్చ..

ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పి ఒప్పించడమే మొదటి విజయం

ఏ మందు అయినా బయటికి రావాలంటే మనుషులు, జంతువులపై ప్రయోగాలు చేయాలి. కొవాగ్జిన్‌ తయారీలోనూ 3 దశల్లో 30 వేల మందిపై క్లినికల్‌ ట్రయల్‌్్స చేశాం. ముందుకొచ్చిన వాలంటీర్లకు ఎదురయ్యే సమస్యలు చెప్పాం. 50 శాతం ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేసి ఒప్పించడమే మొదటి విజయం. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా 30 వేల మంది ముందుకు రావడం గొప్ప విషయం. వారికి అన్నిరకాల భద్రతనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చాం.

కేంద్రం చెప్పాకే బూస్టర్‌ డోసుపై నిర్ణయం

కొవాగ్జినే కాదు ఏ టీకా కూడా వంద శాతం రక్షణ ఇవ్వదు. రెండు డోసులు పూర్తయితే ప్రమాదం ఉండదని చెప్పొచ్చు. ఇప్పుడు కొవాగ్జిన్‌ సామర్థ్యం 78 శాతం. కొత్త వేరియంట్లు పుట్టుకొస్తే ఏడాదికోసారి బూస్టర్‌ డోసు అవసరం వస్తుంది. ప్రజలకు బూస్టర్‌ ఎప్పుడివ్వాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.

యాంటీబాడీస్‌ పరీక్షించుకోవాలి

కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 45 రోజుల్లో యాంటీబాడీస్‌ గరిష్ఠంగా ఉత్పత్తి అవుతున్నాయని గుర్తించాం. వాటి ఉత్పత్తి ఎక్కువ ఉంటే ప్రమాదం తప్పినట్లే. రక్త నమూనాల ద్వారా యాంటీబాడీస్‌ పరీక్ష చేయించుకోవాలి. కొవిడ్‌ బారిన పడిన వారు ఆర్‌టీపీసీఆర్‌లో నెగెటివ్‌ వచ్చిన 3 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మొదటి డోసుగా ఏ వ్యాక్సిన్‌ తీసుకున్నా అమెరికా వెళ్లే వారు అక్కడ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు చెందిన టీకా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అది ఒకే డోసు టీకా.

అమ్మాయిలూ.. వదంతులు నమ్మొద్దు

రుతుక్రమం సమయంలో టీకా తీసుకోవద్దని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వదంతులు ఎవరూ నమ్మొద్దు. ఎలాంటి సమస్యా ఉండదు. కొవాగ్జిన్‌ వందశాతం భద్రమే. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా కొవాగ్జిన్‌ టీకాతో ఏ ప్రమాదం లేదు. అయితే గర్భిణులకు సంబంధించి త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టత వస్తుంది.

టీకా తీసుకున్న వారికి మంచి నిద్ర కావాలి

బయటి నుంచి ఏ కొత్త పదార్థం లోపలికి వెళ్లినా ఒంట్లో కణాలు దానికి స్పందిస్తాయి. టీకా విషయంలోనూ ఇప్పటివరకూ ప్రతి 20మందిలో ఒకరికి జ్వరం, చెమటలు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి సహజమే. టీకా వేసుకున్న వారు ఒకట్రెండు రోజులు శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం మంచిది. మంచి నిద్ర కావాలి. ముందు, వెనక రెండురోజులు మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి.

ప్రయోగాల్లో ముక్కు ద్వారా వ్యాక్సిన్‌

భారత్‌ బయోటెక్‌లో ముక్కు ద్వారా వేసే చుక్కల టీకా (ఇంట్రానేజల్‌ వ్యాక్సిన్‌) కోసం పరిశోధనలు సాగుతున్నాయి. ముక్కు నుంచి టీకా లోపలికి పంపించి నాసిక భాగంలోనే వైరస్‌ను అడ్డుకోవచ్చు. దాని కోసమే ప్రయత్నాలు సాగుతున్నాయి. వాషింగ్టన్‌ యూనివర్సిటీలో జంతువులపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయి’’ అని డా.రేచస్‌ వివరించారు.

ఇదీ చూడండి:

నేటి నుంచి ఏపీ వాసులకు ఈ-పాస్‌ తప్పనిసరి: తెలంగాణ పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.