భారత్ బంద్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రవాణా స్తంభించింది. ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస డిపోల్లో బస్సులు నిలిపివేశారు. దుకాణాలు మూతపడ్డాయి. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ బంద్.. ప్రభావం కనిపిస్తోంది. ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు.. డిపోలకే పరిమితమయ్యాయి. ఓవైపు వర్షం మరోవైపు బంద్ కారణంగా..పాడేరు నిర్మానుష్యంగా మారింది.
Bharat Bandh: రాష్ట్రంలో భారత్ బంద్ ఎఫెక్ట్ - భారత్ బంద్ తాజా
13:59 September 27
శ్రీకాకుళం జిల్లాలో స్తంభించిన రవాణా
13:58 September 27
విశాఖలో బంద్..
నూతన వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలో బంద్ కొనసాగుతోంది. ఉదయాన్నే వామపక్షాలు కర్నూల్ రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. చీరాల, కనిగిరిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రదర్శన చేపట్టారు.
13:58 September 27
కర్నూలు జిల్లాలో బంద్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరూతు వామపక్షాలు చేపట్టిన భారత్ బంద్ కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతొంది. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా కర్నూలులో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఎడ్ల బండ్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రైతు వ్యతిరేక చట్టాలు ఉపశమహరించుకునే వరకు పోరాటం సాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేసారు. నంద్యాలలోని గాంధీచౌక్, శ్రీనివాస సెంటర్ నూనెపల్లె తదితర ప్రాంతాల్లో వామపక్షాలు ధర్నా చేపట్టాయి.
13:57 September 27
రాయలసీమ జిల్లాల్లో బంద్ ప్రశాంతం
రాయలసీమ జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దుకాణాలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు మద్దతు ప్రకటించారు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పెట్రోలు బంకులను ఆందోళనకారులు మూయించారు. కదిరిలో జాతీయ రహదారిపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ధర్మవరంలో నిరసన ర్యాలీ చేశారు.
13:56 September 27
నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మోటర్ సైకిల్ ర్యాలీ
రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ కు మద్దతుగా నెల్లూరులో తెలుగుదేశం పార్టీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. నర్తకి సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆత్మకూరు బస్టాండ్ వరకు సాగింది. ఉదయగిరిలో ఎడ్ల బండి ప్రదర్శనతో అఖిలపక్ష నాయకులు నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెం లో వామపక్ష పార్టీ నాయకుల ఆందోళన చేశారు. నెల్లూరు జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఆత్మకూరులో ఈ ఉదయం నుంచే దుకాణాలు మూతపడ్డాయి. ఆందోళనకారులు నిరసన ర్యాలీ చేపట్టారు.ఉదయగిరిలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టే విధానం ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలంటూ ప్రదర్శన చేశారు. వెంకటగిరిలో RTC బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
12:44 September 27
విజయనగరం జిల్లాలో నిరసనలు
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఆర్.టి.సి కాంప్లెక్స్ వద్ద వామపక్ష నేతలు, వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నాయకులు భారత్ బంద్ నిర్వహించారు. మోడీ అవలంబిస్తున్న నల్ల చట్టాలను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సీపీఎం నాయకులు తమ్మినేని సీతారాం, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సరిగదా రమేష్ మాట్లాడుతూ.... రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టం చేకూరే విధంగా చేసిన విద్యుత్తు చట్ట సవరణ బిల్లులు నిలుపుదల చేయాలన్నారు. 2020 విద్యుత్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలని కార్మికులను యజమానులకు కట్టు బానిసలు గా మార్చే 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని అన్నారు.
10:30 September 27
నిరసనల హోరు
రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలంటూ గుంటూరు జిల్లా వినుకొండలో ర్యాలీ నిర్వహించారు. కడపజిల్లా మైదుకూరులో ద్విచక్రవాహన ర్యాలీనిర్వహించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బంద్ పాటిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా సాగుతోంది. గిద్దలూరులో వ్యాపార సంస్థలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. యర్రగొండపాలెంలో.. దుకాణాలు, పెట్రోల్ బంకులు మూసివేశారు.
10:30 September 27
శ్రీకాకుళం జిల్లాలో స్తంభించిన రవాణా
భారత్ బంద్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో రవాణా స్తంభించింది. ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి, పలాస డిపోల్లో బస్సులు నిలిపివేశారు. దుకాణాలు మూతపడ్డాయి. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ బంద్.... ప్రభావం కనిపిస్తోంది. ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సులు.... డిపోలకే పరిమితమయ్యాయి. ఓవైపు వర్షం మరోవైపు బంద్ కారణంగా..పాడేరు నిర్మానుష్యంగా మారింది.
08:43 September 27
విశాఖ: బంద్‌కు మద్దతుగా అచ్యుతాపురంలో వామపక్షాల ఆందోళన
- విశాఖ: బ్రాండిక్స్ కంపెనీ ఉద్యోగుల బస్సులను అడ్డుకున్న వామపక్షాలు
- విశాఖ: అనకాపల్లి, అచ్యుతాపురం రోడ్డులో భారీగా నిలిచిన వాహనాలు
- విశాఖ: 4 గంటలుగా బస్సుల్లోనే బ్రాండిక్స్ కంపెనీ ఉద్యోగులు
- విశాఖ: బస్సులు అడ్డుకోవడంతో మహిళా ఉద్యోగుల ఇబ్బందులు
08:18 September 27
కడప జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్
కేంద్ర ప్రభుత్వ విధానాలు, నిత్యావసర ధరలకు నిరసనగా.. చేపట్టిన భారత్ బంద్.. కడప జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే వామపక్షాలు, తెలుగుదేశం, కాంగ్రెస్, రైతు సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొంటున్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్, కోటిరెడ్డికూడలి వద్ద నాయకులు బంద్ పాటిస్తున్నారు. భారత్ బంద్‌పై మరింత సమాచారం కడప నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు..
07:45 September 27
విజయవాడ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
- విజయవాడ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారుల నినాదాలు
- విజయవాడ: రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
07:45 September 27
నెల్లూరు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో నిలిచిన 800 బస్సులు
- నెల్లూరు జిల్లాలోని 10 ఆర్టీసీ డిపోల్లో నిలిచిన 800 బస్సులు
- నెల్లూరు: బంద్‌కు మద్దతుగా జిల్లాలో దుకాణాలు మూసివేత
- నెల్లూరు: బంద్‌కు మద్దతుగా పాఠశాలలు స్వచ్ఛందంగా బంద్
07:45 September 27
విజయవాడ
- భారత్ బంద్‌కు లారీ యజమానుల సంఘం మద్దతు
- 6 డిమాండ్లతో బంద్‌కు మద్దతు తెలిపిన లారీ యజమానుల సంఘం
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్
07:13 September 27
తిరుపతిలో బంద్
- తిరుపతి బస్టాండ్ సమీపంలో తెదేపా వామపక్షాల నిరసన
- చిత్తూరు జిల్లావ్యాప్తంగా బస్టాండ్లకే పరిమితమైన బస్సులు
- తిరుమలకు వెళ్లే భక్తులకు బంద్ నుంచి మినహాయింపు
07:09 September 27
అనంతలో..
భారత్ బంద్‌లో భాగంగా అనంతపురం ఆర్టీసీ డిపో వద్ద సీపీఎం, రైతు సంఘాల, అనుబంధ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వామపక్షాలు భారత్ బంద్‌కు పిలుపునివ్వడంతో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రావడం లేదు. బస్టాండ్ పరిసర ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న భాజపా ప్రభుత్వానికి ఈ బంద్ తోనైనా కనువిప్పు కలగాలని నాయకులు కోరుతున్నారు. దేశ సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వ సంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
07:08 September 27
ప్రకాశం జిల్లాలో..
రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త బంద్ నేపధ్యంలో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. ఉదయాన్నే వామపక్షాలు ఒంగోలు ఆర్టీసీ బస్ స్టాండ్ లో నిరసన వ్యక్తం చేశారు. బస్టాండ్ ఆవరణలో కేంద్ర ప్రభుత్వ విదానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డిపో వద్ద బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించడం వల్ల డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులకు మాత్రమే అనుమతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 డిపోల్లో సుమారు 700 సర్వీసులు నిలిచిపోయాయి.
06:56 September 27
bharat bandh live updates
కేంద్ర తీసుకువచ్చిన నూతన సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలు.. నేడు దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌లో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశాయి. దీంతో రాష్ట్రంలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.