ETV Bharat / city

ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీతో జిల్లాకు ప్రయోజనాలు! - lock down news

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వీయ ఆధారిత భారతం ప్యాకేజీతో కృష్ణా జిల్లా పరిధిలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభించినుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు వేల ఎంఎస్​ఎంఈలు లబ్ధి పొందే అవకాశం ఉంది.

benefits-for-krishna-district-with-central-special-financial-package

author img

By

Published : May 14, 2020, 11:34 AM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వీయ ఆధారిత భారతం ప్యాకేజీ పట్ల మధ్యతరగతి కుటుంబాల్లో కొంతమేరకు ఆనందం వ్యక్తమవుతోంది. పేదలకు ఆహార భరోసా, సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ ద్వారా జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊతం లభించినట్లు అయింది. పరిశ్రమలకు మరింత వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య (ఎంఎస్‌ఎంఈ) తరహా పరిశ్రమలు దాదాపు 5వేలు ఉన్నాయి. విజయవాడ ఆటోనగర్‌లోనే 2 వేలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న వర్గీకరణకు మోక్షం లభించింది. గతంలో రూ25లక్షలు ఉన్న సూక్ష్మ పరిశ్రమల పెట్టుబడిని రూ.కోటికి, టర్నోవర్‌ను 5కోట్లకు పెంచారు.

చిన్న పరిశ్రమల పెట్టుబడి రూ.5కోట్ల నుంచి రూ.10కోట్లకు పెంచారు. మధ్యతరహా పరిశ్రమలకు రూ.10కోట్ల నుంచి 20 కోట్లుకు పెంచారు. దీని వల్ల ఆయా రాయితీలు పెరిగే అవకాశం ఉంది.

* ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇచ్చేందుకు అవకాశం కల్పించారు. ఎంఎస్‌ఎంఈలలో పనిచేస్తున్న కార్మికులకు రూ.15 వేల లోపు ఉన్నవారికి ప్రభుత్వమే యాజమాన్యం తరపున పీఎఫ్‌ జమ చేస్తుంది. ఇది 24 శాతం ఉంటుంది. జిల్లాలో దాదాపు 10వేల మంది వరకు ఈ తరహా కార్మికులు ఉంటారు. మొత్తం ఆరు నెలల పాటు ఇవ్వనుంది. కనీసం రూ.4కోట్ల మేర లబ్ధి ఉంటుంది.

* రుణాలపై ఏడాది పాటు మారిటోరియం ఉంది. కానీ వడ్డీ మాఫీ చేయలేదన్న అసంతృప్తి పారిశ్రామిక వర్గాల్లో ఉంది.

* విద్యుత్తు పంపిణీ సంస్థలకు రూ.90 వేల కోట్లు కేటాయించడంతో ఆ మేరకు వినియోగదారులకు రాయితీలు లభించే అవకాశం ఉంది. విద్యుత్తు యూనిట్‌ ధరను తగ్గిస్తారని ఆశిస్తున్నారు. ఇది అమలు కావాల్సి ఉంది. ఇది జరిగితే.. జిల్లాలో 16 లక్షల మందికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

సంక్షేమానికి ప్రాధాన్యం!

* జిల్లాలో జన్‌ధన్‌ ఖాతాలు 4.59 లక్షలు ఉన్నాయి. వీరికి మూడు నెలల పాటు రూ.500 చొప్పున జమ చేయనున్నారు. నెలకు రూ.22.98కోట్లు లబ్ధిపొందనున్నారు.

* పీఎం కిసాన్‌ కింద రూ.2000 చొప్పున జమ చేయనున్నారు. జిల్లాలో దాదాపు 4.50 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.

* పేదలకు 3 నెలల పాటు ఉచిత వంటగ్యాస్‌ పంపిణీ చేయనున్నారు. దీపం కనెక్షన్ల కింద జిల్లాలో 1.50లక్షల మంది దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. దాదాపు మూడు నెలలకు రూ.1800 చొప్పున ప్రయోజనం పొందనున్నారు.

* జిల్లాలో బీపీఎల్‌ కుటుంబాలు దాదాపు 12.92 లక్షలు ఉన్నాయి. కార్డుల ద్వారా కుటుంబానికి పప్పు కేజీ, వ్యక్తికి 5కేజీల బియ్యం మూడు నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే రేషన్‌కు ఇది అదనం.

* రూ.1000 చొప్పున దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, వృద్ధులకు చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు. ప్రస్తుతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వారికి ఇది అదనంగా అందనుంది.

* ఉపాధి హామీ పథకం కింద పనులకు వెళ్లే వారికి రోజువారీ కనీస వేతనం రూ.182 నుంచి రూ.202 కు పెంచారు. దాదాపు 10లక్షల మంది జాబ్‌కార్డులు ఉన్నవారికి ఇది ఉపయోగం. వంద రోజుల పనికి ఇది నరేగా కింద వర్తిస్తుంది.

నిర్మాణ రంగానికి ఏదీ ప్రోత్సాహం..?

"నిర్మాణ రంగానికి ప్రోత్సాహం లభించలేదు. ఆరు నెలలు గడువు పొడిగించడం మినహా ఎలాంటి ప్రయోజనం లేదు. కనీసం కొనుగోలు దారులకు రాయితీలు అందించాల్సింది. వడ్డీల రాయితీలు, రుణాలపై మారిటోరియం లాంటి చర్యలు లేవు. కృష్ణా జిల్లాలో 10వేల ఫ్లాట్లు కొనుగోలు లేకుండా మిగిలిపోయాయి. సిమెంటు ధరలు పెరిగిపోయాయి. వలస కార్మికులకు రక్షణ లేదు." - ఆర్వీ స్వామి, అధ్యక్షుడు, క్రెడాయ్‌

ఇదీ చదవండి:

24 గంటల్లో 134 మరణాలు, 3722 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.