BC community representatives met Chandrababu : జాతీయ స్థాయిలో చేపడుతున్న జనగణనలో బీసీ కుల గణన కూడా చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబును రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కోరారు. బీసీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందడం లేదని బీసి సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా తెదేపా హయాంలో 2014 సెప్టెంబర్ 6న జనగణనకు మద్దతుగా అసెంబ్లీలో తీర్మానం చేసినట్లు చంద్రబాబు గుర్తుచేశారు. బీసీ కుల గణన జరిగినపుడే సంక్షేమ ఫలాలు సమర్ధవంతంగా బీసీలకు అందుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్నారు.
సర్పంచ్‌ల న్యాయపోరాటానికి అండగా ఉంటాం...
రాష్ట్రంలో ఎక్కువగా వైకాపా మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఉన్నప్పటికీ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ జగన్ రెడ్డి చేపడుతున్న చర్యలపై తెలుగుదేశం అలుపెరగని పోరాటం చేస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు చంద్రబాబును కలిసి తమ సమస్యలను విన్నవించారు. 73వ రాజ్యాంగ సవరణలో పంచాయతీలకు ప్రత్యేక అధికారాలిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం వాటిని కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. సర్పంచ్‌ల సంఘం చేసే న్యాయపోరాటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.