పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్ల రంగులు మార్చడానికి రూ.16 కోట్లు ఖర్చు పెట్టిన వైకాపా ప్రభుత్వం.. వాటిని కొనసాగించడానికి ఏమాత్రం చొరవ చూపడంలేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అన్న క్యాంటీన్లపై మంత్రి బొత్స వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. పేదలకు ప్రయోజనకరమైన క్యాంటీన్లపై లాభాపేక్ష చూడడం ఏమిటని ప్రశ్నించారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటీన్‌ను నెలరోజులుగా తన సొంత నిధులతో నిర్వహిస్తున్నారు. విశాఖ నగరంలోని తెదేపా నేతలతో పాటు, భాజపా నేత విష్ణుకుమార్ రాజు... కేజీహెచ్ అన్న క్యాంటీన్‌ను సందర్శించారు. క్యాంటీన్ల పేరు మార్పుచేసి... తిరిగి నిర్వహించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. కనీసం అక్టోబర్ 2 నాటికైనా అన్న క్యాంటీన్లు తెరుస్తారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: