రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుపై రాజ్యాంగానికి వ్యతిరేకంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు అన్నారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని సీఎం జగన్ మినహా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని, సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మూడు రాజధానుల మాటపై వైకాపా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు.
సోము వీర్రాజు భాజపా అధ్యక్షుడు అయినప్పుప్పటి నుంచి రాజధాని విషయంలో పూటకో మాట మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపనను ప్రధాన మంత్రి మోదీ చేతులతోనే చేశారని అయ్యన్న గుర్తుచేశారు. మట్టి, నీళ్లు ఇచ్చారని.. భాజపా ఈ విషయాలను పునరాలోచించుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏమయ్యిందో ఆలోచించుకోవాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం