ETV Bharat / city

కరోనాపై ప్రచారానికి.. యముడు, చిత్రగుప్తుడు వచ్చారు!

author img

By

Published : May 5, 2020, 5:56 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు అధికారులు, పోలీసులు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలోని నల్గొండలో యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో ప్రచారం చేశారు.

awareness-on-lockdown-and-corona-virus
కరోనాపై యముడు, చిత్రగుప్తుడి వేషధారులతో అవగాహన

తెలంగాణలోని నల్గొండ జిల్లా రూరల్​ పోలీసులు కరోనా వైరస్​పై వినూత్న రీతిలో అవగాహన కల్పిస్తున్నారు. రోడ్లపైకి అనవసరంగా వస్తున్న వారికి యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో నిబంధనలు గుర్తు చేస్తున్నారు.

జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్​ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అత్యవసర పరిస్థితిలో మాత్రమే బయటకు రావాలని, అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన హోంగార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.