డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (DEE-CET results) ఫలితాలు అభ్యర్థులతో దోబూచులాడాయి. ఫలితాలను మొదట వెబ్‌సైట్‌లో పెట్టిన అధికారులు ఆ తర్వాత శనివారం రాత్రి వాటిని నిలిపివేశారు. అప్పటికే చాలామంది విద్యార్థులు ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈనెల 26, 27 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 29న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. శనివారం సమాధాన పత్రాలతో పాటు ర్యాంకు కార్డులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అనంతరం ఏ కారణం చేతనో ఫలితాలను నిలిపివేశారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చదవండి