ETV Bharat / city

అమానుషం.. కాళ్లూ చేతులూ పట్టి.. నేలపైకి విసిరికొట్టి..!

తనకు పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ ఆవేదన చెందింది. తన బంధువులకు బాబు ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయింది. అదే ఆలోచిస్తూ మూడేళ్ల బాబుపై పగను పెంచుకుంది. తాజాగా ఆ పిల్లాడిని భవనంపైకి తీసుకెళ్లి కింద పడేసి చంపేసింది.

boy murder
బాలుడు హత్య
author img

By

Published : Mar 3, 2021, 9:06 AM IST

ఈర్ష్య వివేకాన్ని చంపేసింది. అసూయ మానవత్వాన్ని మింగేసింది. అమానుషత్వం ఓ ముక్కుపచ్చలారని పసిబాలుడి ఉసురు తీసింది. నిండా మూడేళ్లు నిండని బాలుడిని రెండో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి విసిరేసిందో మహిళ. బాలుడి కాళ్లూ చేతులు పట్టుకుని, పక్కింటి వారు చూస్తుండగానే, వద్దువద్దని వారు వారిస్తుండగానే నిర్దయగా కిందికి తోసేసింది. తనకు పిల్లలు లేకపోవడం, బావ కుమారుడిని అందరూ ముద్దు చేయడాన్ని సహించలేని, భరించలేని ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. గతంలోనూ ఆ పసివాడిని కరెంట్‌ షాక్‌తో చంపబోయింది. ఆ చిన్నారి సుకుమారపు చేతులను తలుపుల మధ్య ఇరికించడం వంటి వికృత చేష్టలకు పాల్పడింది.

boy murder
బాలుడు హత్య

భవానీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, బాధిత కుటుంబ సభ్యులు అందించిన వివరాలివి. హైదరాబాద్‌ పాతబస్తీలోని ఈదీబజార్‌ కుమార్‌వాడికి చెందిన మహ్మద్‌ ఎతేషాముద్దీన్‌ (32), సుజావుద్దీన్‌ (27)లు సోదరులు. ఒకే భవనంలో ఉంటున్నారు. ఎతేషాముద్దీన్‌కు అస్మాసిద్దికా (26)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. గతంలో వీరికి కుమార్తె జన్మించిన ఐదు రోజులకే చనిపోయింది. మూడేళ్ల క్రితం వీరికి నుమానుద్దీన్‌ (3) జన్మించాడు. బాలుడు ఒక్కడే కావడంతో అందరూ ప్రేమతో చూసుకునేవారు. ఏడాదిన్నర క్రితం సుజావుద్దీన్‌కు ఆయేషాబాను (24)తో వివాహమైంది. వీరికి సంతానం లేదు.

తన భర్త కూడా బాలుడితో ప్రేమగా మెలగడంతో ఆయేషాబాను పిల్లాడిపై అసూయ పెంచుకుంది. గతంలో బాలుడిని చంపడానికి ప్రయత్నించినప్పుడు కుటుంబ సభ్యులు మందలించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పెద్దలు నచ్చజెెప్పడంతో కొన్ని రోజుల క్రితం తిరిగి వచ్చింది. మంగళవారం ఉదయం బాలుడిని భవనం రెండో అంతస్తుపైకి తీసుకెళ్లింది. బాలుడి చేతులు, కాళ్లు పట్టుకుని భవనంపై నుంచి కిందకు తోసేసింది. బాలుడికి తీవ్రగాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. నిందితురాలు ఆయేషాబానును పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ఇన్​స్టాలో చాటింగ్​... పెళ్లి అనగానే చీటింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.