ETV Bharat / city

Atchannaidu: వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఖండిస్తే వేధిస్తారా?: అచ్చెన్నాయుడు - తెదేపా అచ్చెన్నాయుడు తాజా వార్తలు

చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతల్ని పోలీసుల వేధించటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు
author img

By

Published : Nov 25, 2021, 1:11 PM IST

చంద్రబాబు సతీమణిపై వైకాపా నేతల వ్యాఖ్యల్ని ఖండించిన అనంతపురం తెలుగు బీసీ మహిళా నేతలను పోలీసులు వేధించటం దుర్మార్గమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడిన వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలేసి బూతులు మాట్లాడొద్దన్న మహిళలను వేధిస్తారా అని మండిపడ్డారు. వారు చేసిన తప్పేంటని ప్రశ్నించారు.

అరెస్టు చేయాల్సింది మహిళలను కాదన్న అచ్చెన్న.. అసెంబ్లీ సాక్షిగా స్త్రీ జాతిని అవమానించిన వైకాపా మంత్రి, ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలన్నారు. మహిళల పట్ల వైసీపీ నేతల వ్యహహారశైలి, భాషను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రికి మహిళలపై గౌరవం ఉంటే అసెంబ్లీలో మహిళలను అవమానించిన వారిని పదవుల నుంచి తొలగించి, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

వర్ల దంపతుల 12 గంటల నిరసన దీక్ష

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.