ETV Bharat / city

మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన శస్త్రచికిత్స గాయం - ఈఎస్​ఐ స్కాంలో అచ్చెన్న అరెస్ట్ వార్తలు

Atchannaidu
Atchannaidu
author img

By

Published : Jun 17, 2020, 1:22 PM IST

Updated : Jun 17, 2020, 3:21 PM IST

13:10 June 17

జీజీహెచ్​లో అచ్చెన్నాయుడికి శస్త్రచికిత్స

గుంటూరు జీజీహెచ్​లో ఉన్న మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఇవాళ వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనను ఆరు రోజుల క్రితం అరెస్టు చేశారు. అంతకు రెండు రోజుల ముందే శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చన్నాయుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా... కోర్టు ఆయనను జీజీహెచ్ కు తరలించాలని ఆదేశించింది.

అచ్చెన్నాయుడిని విజయవాడకు తీసుకొచ్చే క్రమంలో 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేయించారు. దీంతో ఆయనకైన గాయం తిరగబెట్టింది. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే రక్తస్రావం సమస్య ఉండటంతో వైద్యులు ఆయనకు ఇవాళ చిన్నపాటి శస్త్రచికిత్స చేశారు. ఇన్ ఫెక్షన్ కారణంగా సమస్య తలెత్తినట్లు వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించి ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఆపరేషన్ చేశారు. ఆయన ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

చైనా-భారత్ వివాదం: ఈటీవీ భారత్ కథనాలు

Last Updated : Jun 17, 2020, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.