వైకాపా ప్రభుత్వం తప్పులను ప్రశ్నిస్తే ఏసీబీ(ACB) కేసులు పెట్టిందని, వాటికీ చిక్కని వారిని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(PCB) తో అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందుల పాలు చేశారని అచ్చెన్నాయుడు (atchannaidu) దుయ్యబట్టారు. సీఐడీ అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి(cm ys jagan) కి జేబు సంస్థగా మారిందన్నారు. తాడేపల్లిలో నిర్ణయం తీసుకుంటే సీఐడీ అమలు చేస్తోందని విమర్శించారు. 96 హామీలు అమలు చేశామని ఊకదంపుడు ప్రసంగాలు చెప్తున్నారని, 96 తప్పులు పూర్తయ్యాయని, ఇక నాలుగు తప్పులు చేస్తే 100 తప్పులు పూర్తి చేసుకుని గిన్నిస్ బుక్ లోకి ఈ ప్రభుత్వం ఎక్కడానికి సిద్ధంగా ఉందని ఎద్దేవా చేశారు.
అమరావతి (amaravathi)ని చంపేశారని.. రివర్స్ టెండరింగ్(reverse tendering) పేరుతో పోలవరం(polavaram) ప్రాజెక్టులో గుత్తేదారులకు కోట్ల రూపాయలను దోచిపెట్టారని అచ్చెన్న ఆరోపించారు. పోలవరం ఈ ఏడాది జూన్1 కి పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి గొంతు చించుకొని చెప్పారని.. జూన్ 1 వస్తోందని గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వం(YCP Govt) లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉన్నారని.. వారంతా డమ్మీలని అచ్చెన్నాయుడు విమర్శించారు. తెదేపాను తిట్టడానికి తప్ప ఇంకో పని వారికి లేదన్నారు. కనీసం శాఖాపరమైన ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆక్షేపించారు.
ఇదీ చదవండి