రాష్ట్రానికి సంబంధించి నవంబర్ నెలకు గాను 43.20 లక్షల మంది రైతులకు పీఎం - కిసాన్ నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్లో 46.86 లక్షల మంది రైతులు ఈ పథకం కింద నమోదు కాగా.. అందులో 43.20 లక్షల మంది రైతులకు కేంద్రం నిధులిచ్చింది. జిల్లాల వారీగా చూసుకుంటే అనంతపురంలో 4.72 లక్షలు, కర్నూలులో 4.05 లక్షలు, తూర్పు గోదావరిలో 4 లక్షలు, గుంటూరులో 3.89 లక్షలు, చిత్తూరు 3.75 లక్షలు, ప్రకాశం 3.48 లక్షలు, పశ్చిమ గోదావరిలో 3.22 లక్షలు, పశ్చిమ గోదావరిలో 3.04 లక్షలు, విశాఖపట్నంలో 2.83 లక్షల మంది, వైయస్ఆర్ జిల్లాలో 2.56 లక్షలు, విజయనగరంలో 2.40 లక్షలు, నెల్లూరులో 2.28 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.
ఆధార్ లింకు ఉన్న ఖాతాలకు మాత్రమే నిధులు
డిసెంబరు నుంచి పీఎం కిసాన్ నిధులను అర్హత గల రైతులకు, ఆధార్ లింకు చేయబడి ఉన్న బ్యాంకు ఖాతాలకు మాత్రమే బదిలీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. లబ్ధిదారులకు వాయిదాల పద్దతిలో వివిధ దశల్లో పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కొంతమంది రైతులకు మూడు వాయిదాలు లభించగా, కొంతమందికి రెండు వాయిదాలు అతికొద్ది మందికి మాత్రమే ఒక వాయిదా లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇవీ చూడండి: