స్కూల్ ప్రిన్సిపల్‌పై హత్యాయత్నం (Assassination Attempt on School Principal) జరిగిన ఘటన తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బహదూర్‌పల్లి.. గ్రీన్‌హిల్స్ కాలనీలో చోటుచేసుకుంది. గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన హరిప్రసాద్ స్థానికంగా భవ్య సాయి స్కూల్ యజమానిగా ఉంటూ స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. గ్రీన్‌హిల్స్‌లో ఆయనకు వాటర్ ప్లాంట్ ఉంది. శనివారం రాత్రి 9:30 ప్రాంతంలో దానిని మూసి అక్కడి నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు వెళ్తుండగా ఓ యువకుడు ప్రిన్సిపల్ హరిప్రసాద్ మొహం, మెడ, ఛాతీపై కత్తితో దాడి చేసి చంపబోయాడు.
దాడి చేస్తున్న సమయంలో అటు నుంచి కొంత మంది వ్యక్తులు రావడం చూసి నిందితుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హరిప్రసాద్ ప్రస్తుతం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
ఇదీ చదవండి: