సీపీఎస్ స్థానంలో జీపీఎస్‌ను అంగీకరించబోమని రాష్ట్ర సచివాలయ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ఆర్థికశాఖ కార్యదర్శి గుల్జార్‌ను కలిసిన అప్సా ప్రతినిధులు.. వారి సమస్యలను వివరించారు. జీపీఎస్‌పై ప్రభుత్వం ఇచ్చిన ప్రతిపాదన ప్రజెంటేషన్‌లో రాష్ట్ర ఆదాయాల్లో ఏటా సగటు వృద్ధి కేవలం 4 శాతమే చూపడం సరికాదని ఉద్యోగులు పేర్కొన్నారు. ప్రభుత్వం లెక్కలు ప్రభుత్వానికి ఉంటాయని.. ఉద్యోగ సంఘాల ప్రతినిధులుగా ఏం చెప్పాలో చెప్పాలని గుల్జార్ అన్నారు. రాష్ట్ర ఆదాయంలో సరాసరి ఏటా కనీసం 12 శాతం పెరుగుదల ఉంటుందంటూ అప్సా ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉద్యోగుల పెన్షన్‌ను సామాజిక కోణంలో చూడాలి కానీ.. ఆర్థిక కోణంలో చూడొద్దని ఉద్యోగులు విన్నవించారు.
ఇదీ చదవండి: జగన్ పాలనలో రాష్ట్రం.. నరకాంధ్రప్రదేశ్‌గా మారింది: చంద్రబాబు