ETV Bharat / city

తెలంగాణ: రేపు యాదాద్రిలో లక్ష్మీ నారసింహుని కల్యాణోత్సవం

తెలంగాణలో సుప్రసిద్ధమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం సోమవారం జరగునుంది. రేపు ఉదయం బాలాలయంలో జరిగే కల్యాణ వేడుకకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం సాయంత్రం కొండ కింద కల్యాణం చేయనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున ఈ వేడుకను భక్తులు వీక్షించేందుకు వీలుగా కొండకింద జడ్పీ పాఠశాలలో జరపనున్నారు.

author img

By

Published : Mar 21, 2021, 10:44 PM IST

రేపు యాదాద్రిలో లక్ష్మీ నారసింహుని  కల్యాణోత్సవం

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి 7.30 గంటలకు కొండకింద జరగనున్న వైభవోత్సవ కల్యాణం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. కొండకింద పాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బారికేడ్లు అమర్చారు. వివిధ రూపాలతో ఉన్న విద్యుద్దీపాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణమండపం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. స్వామి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించే విధంగా ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల15వ తేదీన ప్రారంభమైన యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు 25న ముగియనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రేపు స్వామివారి కల్యాణ మహోత్సవం ఉదయం కొండపైన బాలాలయంలో నిర్వహిస్తారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున భక్తులు వీక్షించేలా కొండకింద జరపనున్నారు.

ఇదీ చదవండి:

డొంకరాయి జలాశయం నుంచి గోదావరి డెల్టాకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.