ETV Bharat / city

Teachers Protest: నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసనలు.. కార్యాచరణపై నేడు సమావేశం

పీఆర్సీలో జరుగుతున్న నష్టాన్ని సరిదిద్దాలని కోరుతూ.. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, డీఆర్వో, జేసీలకు శుక్రవారం ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. నేడు జరగనున్న ఫ్యాప్టో సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.

Teachers protest
Teachers protest
author img

By

Published : Feb 12, 2022, 7:04 AM IST

ఉద్యోగ, ఉపాధ్యాయ, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులు, పింఛన్‌దారులకు పీఆర్సీలో జరుగుతున్న నష్టాన్ని సరిదిద్దాలని కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, డీఆర్వో, జేసీలకు శుక్రవారం ఉపాధ్యాయులు వినతిపత్రాలు సమర్పించారు. విజయవాడలో సబ్‌ కలెక్టర్‌కు ఫ్యాప్టో ఛైర్మన్‌ సుధీర్‌ బాబు, కో ఛైర్మన్‌ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు ప్రసాద్‌ వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఫిట్‌మెంట్‌ పెంచాలని, పీఆర్సీ నష్టాన్ని సరిదిద్దాలని నినాదాలు చేశారు.

‘చలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను ప్రభుత్వం గుర్తించింది. మంత్రుల కమిటీతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయ సంఘాలు ప్రధానంగా 23శాతం ఫిట్‌మెంట్‌, జనవరి నుంచి గ్రాట్యుటీ అమలు, సీపీఎస్‌ తదితర అంశాలపై విభేదించాయి. వీటితోపాటు ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల క్రమబద్దీకరణపై మంత్రుల కమిటీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో 13లక్షల ఉద్యోగులకు నష్టాన్ని కలిగిస్తోంది. దీనిపై సీఎం జగన్‌ పునఃసమీక్షించాలి’’ అని ఉపాధ్యాయులు విన్నవించారు.

ఫిట్‌మెంట్‌ 27శాతం కంటే ఎక్కువ ఇవ్వాలని, గ్రాట్యూటీ ఏప్రిల్‌ 2020 నుంచి అమలు చేయాలని, సీపీఎస్‌ రద్దు, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల క్రమబద్దీకరణ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను గతేడాది అక్టోబరు 22నుంచి రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో శనివారం ఉద్యమ కార్యాచరణపై ఫ్యాప్టో ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి:

CBN: ధైర్యం ఉంటే.. జగన్ ఆ పని చేయగలరా ?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.