APTF: ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపై పెట్టే ఖర్చు పెరిగిపోతుందని ఉద్యోగవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేలా ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఉందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు హృదయరాజు అన్నారు. ‘30 ఏళ్ల సర్వీసు చేసిన ఉద్యోగికి, కుటుంబానికి రక్షణ కల్పించే విధానాలు లేకపోతే ఎలా? అసలు ఉద్యోగి ప్రజల్లో భాగం కాదా? ఈ వర్గానికి పెట్టే ఖర్చును బూచిగా చూపడం ఏంటి?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: ఆ నోటీసులపై కౌంటర్ దాఖలు చేయాలని... సీఆర్డీఏ అధికారులకు హైకోర్టు ఆదేశాలు