వివిధ పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ యోచిస్తోంది. ప్రాథమికంగా పది చోట్ల ఇలాంటివి గుర్తించినా... వాస్తవ పరిస్థితులపై పరిశీలనకు ముగ్గురు సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక వచ్చాక టెండర్లు పిలిచి వార్షిక లీజు ఎక్కువగా ఇచ్చే సంస్థకు అప్పగించాలా లేదా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఇవ్వాలా అనే విషయాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకున్న అనంతరం నిర్ణయం తీసుకోనుంది. ఏపీటీడీసీకి వివిధ జిల్లాల్లో హోటళ్లు, రిసార్టులు, ఇతరత్రా కలిపి 37 ప్రాజెక్టులు ఉన్నాయి. నెల్లూరు, కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొన్నింటి వ్యాపారం సరిగ్గా సాగక నిర్వహణ భారమవుతోందని భావిస్తోంది.
ఇదీ చదవండి:చూస్తే అదిరిపొద్ది...తుమ్మలబైలు ఏకో టూరిజం