ఆర్టీసీలో పనిచేస్తోన్న 7600 మంది పొరుగు సేవల ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలను చెల్లించాలని ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నెల వేతనంలో 90 శాతం మాత్రమే చెల్లించాలని ఆదేశాల్లో తెలిపారు. లాక్‌డౌన్‌తో పొరుగు సేవల ఉద్యోగులకు ఏప్రిల్ నెల జీతాన్ని ఆర్టీసీ చెల్లించలేదు. ప్రస్తుతం బస్సులు నడస్తున్నందున... ఉద్యోగుల విన్నపం మేరకు వేతనాలు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. బస్సుల్లో ప్రయాణానికి జర్నలిస్టులకు ఇచ్చే రాయితీని పునరుద్ధరిస్తూ ఎండీ ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి: