ETV Bharat / city

APSRTC CHARGES HIKE : చెప్పింది రూ.3.. పెంచింది 15

author img

By

Published : Apr 15, 2022, 4:56 AM IST

APSRTC CHARGES HIKE : నష్టాల్ని తగ్గించుకునేందుకు కేవలం డీజిల్‌ సెస్‌ విధిస్తూ.... స్వల్పంగా ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన ఆర్టీసీ ఆచరణలో మాత్రం పేదలపై పెద్ద భారమే మోపింది. కేవలం మూడు రూపాయలు పెంచుతున్నామని చెప్పిపల్లెవెలుగు, సీటీ సర్వీసుల ఛార్జీలను ఏకంగా రెట్టింపు వడ్డించింది.

APSRTC
APSRTC

APSRTC CHARGES HIKE : డీజిల్‌ ధరల పెంపుదలతో వస్తున్న నష్టాల్ని తగ్గించుకునేందుకు స్వల్పంగా ఛార్జీలు పెంచేందుకు రూపకల్పన చేశాం. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడికి డీజిల్‌ సెస్‌ రూ.2, భద్రత సెస్‌ రూ.1 కలిపి రూ.3 మాత్రమే పెంచుతున్నాం. చిల్లర సమస్య లేకుండా మొత్తంగా రూ.5 పెంచాం’ అని ఆర్టీసీ ఛైర్మన్‌, ఎండీ ప్రకటించారు. కానీ గురువారం నుంచి పెంచిన ఛార్జీలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో తక్కువ దూరాలకు ఛార్జీలు రెట్టింపయ్యాయి. కొందరు ప్రయాణికులకు ఒక్కో టికెట్‌ ధరపై ఏకంగా రూ.15 భారం పడింది. పల్లెవెలుగు, సిటీ బస్సు ప్రయాణికులపైనే అడ్డగోలుగా బాదేశారు. గతంలో రూ.10 ఛార్జీ చెల్లించి ప్రయాణించేవారు ఇపుడు రూ.20, రూ.15 ఉండే ఛార్జీకి రూ.30 చొప్పున చెల్లించి జేబులు ఖాళీ చేసుకోవాల్సి వస్తోంది.

* విజయవాడ నుంచి 345 కి.మీ. దూరంలో విశాఖపట్నానికి సూపర్‌లగ్జరీ సర్వీసులో రూ.560 ఉన్న ఛార్జీ రూ.580 అయింది. పెరిగిన రూ.20లో.. డీజిల్‌ సెస్‌ రూ.10 అయితే మిగిలిన రూ.10 టోల్‌ ఛార్జీలది.

* అదే విజయవాడ నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న అవనిగడ్డకు పల్లెవెలుగు సర్వీసులో రూ.50 ఉన్న టికెట్‌ ధరను రూ.15 పెంచి రూ.65 చేసేశారు.

* విజయవాడలోని సిటీ ఆర్డినరీ సర్వీసులో ఆటోనగర్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు ఛార్జీ రూ.10 మాత్రమే. ఇప్పుడు రూ.20 అయింది. ఆటోనగర్‌ నుంచి వైఎస్‌ఆర్‌ కాలనీకి రూ.15గా ఉన్న ఛార్జీ రూ.30కి చేరింది.

* ఆర్టీసీ డీజిల్‌ సెస్‌ రూపంలో ఓ క్రమపద్ధతి లేకుండా ఛార్జీలు పెంచి ప్రధానంగా పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో ప్రయాణించేవారిపై ఎంత భారం వేసిందో చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.

49 శాతం పల్లెలకు తిరిగే బస్సులే : ఆర్టీసీ నడిపే బస్సుల్లో గ్రామాలకు తిరిగే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసులే దాదాపు సగం ఉన్నాయి. సంస్థ బస్సులు, అద్దెవి కలిపి మొత్తం 11,299 బస్సులు ఉంటే అందులో 5,541 (49.04%) పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు సర్వీసులే. మిగిలినవాటిలో సిటీ సర్వీసులు 10.25 శాతం, ఏసీ బస్సులు 3.23 శాతం, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, ఘాట్లలో తిరిగే సర్వీసులు కలిపి 37.48 శాతం ఉన్నాయి. ఈ లెక్కన పల్లెవెలుగు, సిటీ సర్వీసులు కలిపి దాదాపు 60 శాతం ఉండగా, వీటిలో ప్రయాణించేవారికే అధిక భారం పడింది.

ఇష్టానుసారం పెంపు

ఓ విధానం అంటూ లేకుండా వివిధ ఆర్టీసీ సర్వీసుల్లో ఇష్టానుసారం ఛార్జీలు పెంచారు.

* కడప నుంచి 35 కి.మీ.దూరంలో ఉన్న మైదుకూరుకు ఛార్జీ రూ.40 ఉండగా రూ.45 చేశారు. అయితే కడప నుంచి మైదుకూరు మీదుగా ప్రొద్దుటూరుకు 55 కి.మీ. దూరానికి ఇప్పటి వరకు ఛార్జీ రూ.50 ఉండగా.. డీజిల్‌ సెస్‌తో కలిపి ఇప్పుడది ఏకంగా రూ.65 అయింది.

* అనంతపురం నుంచి 21 కి.మీ. దూరంలో ఉండే నార్పలకు పల్లెవెలుగులో రూ.20 ఛార్జి ఉండగా, ఇప్పుడు రూ.30 చేశారు.

* గుంటూరు నుంచి పర్చూరుకు రూ.35గా ఉండే ఛార్జీ రూ.50 అయింది. గుంటూరు నుంచి అమరావతికి రూ.30 ఛార్జీ రూ.40కి పెరిగింది.

సిటీ బస్సుల్లోనూ రెట్టింపు

డీజిల్‌ సెస్‌, భద్రతా సుంకం పేరుతో సిటీ బస్సుల్లో 9 స్టేజీల్లో వెళ్లే 18 కి.మీ. దూరానికి ఛార్జీలు రెట్టింపు చేశారు. తొలుత కనీస ఛార్జి రూ.5 నుంచి రూ.10కి పెంచారు. ఆ తర్వాత ఎన్ని స్టేజిలు పెరిగినా రూ.5 మాత్రమే డీజిల్‌ సెస్‌ రూపంలో పెరగాల్సి ఉంది. కానీ అది రూ.10, రూ.15 చొప్పున పెంచారు. 3, 4, 5 స్టేజ్‌ల వరకు రూ.10 ఉండే ఛార్జీని రూ.20.. 8, 9 స్టేజ్‌లకు రూ.15గా ఉన్న ఛార్జీ ఏకంగా రూ.30కి పెంచేశారు.

* విశాఖలోని పాత పోస్టాఫీసు నుంచి మాధవధార ఉడా కాలనీకి రూ.15 ఛార్జి ఉండగా, ఇప్పుడు రూ.30 చేశారు. విశాఖ నుంచి అనకాపల్లికి రూ.50 ఛార్జీని రూ.60కి పెంచారు.

ఏసీ బస్సుల్లోనూ బాదుడే: ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, అల్ట్రాడీలక్స్‌, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో టికెట్‌పై రూ.10 చొప్పున డీజిల్‌ సెస్‌ రూపంలో ఛార్జీ పెరిగింది. జాతీయ రహదారులపై వెళ్లే సర్వీసులకు టోల్‌ గేట్లు ఉంటే మరో రూ.10 అదనంగా పెంచారు. ఏసీ బస్సులకు మాత్రం వడ్డన అధికంగానే ఉంది.

* గుంటూరు నుంచి హైదరాబాద్‌కు గరుడ సర్వీసులో రూ.580గా ఉన్న ఛార్జీ రూ.620 అయింది.

* విజయవాడ నుంచి అనంతపురానికి ఇంద్ర సర్వీసులో రూ.795 ఛార్జీ ఉండగా, ఇపుడు రూ.829 అయింది.

ప్రయాణికులతో వాగ్వాదాలొద్దు: బస్సుల్లో ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఎవరైనా ప్రశ్నిస్తే.. వారితో వాగ్వాదానికి దిగొద్దని, సర్దిచెప్పే ప్రయత్నం చేయాలంటూ డిపో మేనేజర్లు కండక్టర్లు, డ్రైవర్ల ఫోన్లకు సందేశాలు పంపారు. డీజిల్‌ ధరలు భారమవడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పాలని ఆ సందేశాల్లో పేర్కొన్నారు.

నష్టాల పేరిట బాదేశారు: గ్రామాలకు తిరిగే పల్లెవెలుగు సర్వీసులు, విజయవాడ, విశాఖపట్నంలలో తిరిగే సిటీ సర్వీసులతో ఎక్కువ నష్టం ఉంటోందని ఆర్టీసీ అధికారులు చాలాకాలంగా చెబుతున్నారు. ఆ నష్టాన్ని తగ్గించేందుకు ఇప్పుడు డీజిల్‌ సెస్‌ రూపంలో వీటిలోనే ఎక్కువ ఛార్జీలు పెంచినట్లు తెలుస్తోంది.

తెలంగాణతో సమానమట! డీజిల్‌ సెస్‌ వేశామని ఆర్టీసీ అధికారులు బయటకు చెబుతున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. తెలంగాణలో ఏయే సర్వీసుల్లో, స్టేజీల వారీగా ఎంత ఛార్జీలు ఉన్నాయో కచ్చితంగా వాటినే మన రాష్ట్రంలో కూడా అమలు చేసేలా ఛార్జీలు క్రమబద్ధీకరించినట్లు ఆర్టీసీ వర్గాల సమాచారం. ఆ రాష్ట్రంలో డీజిల్‌ సెస్‌తోపాటు, పల్లెవెలుగు, ఏసీ సర్వీసుల్లో కొత్తగా భద్రతా సెస్‌ను అమలు చేయగా మన దగ్గరా వీటిని అమల్లోకి తెచ్చారని చెబుతున్నారు.

ఇదీ చదవండి: APSRTC CHARGES HIKE :ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం.. డీజీల్ సెస్ పేరుతో ఛార్జీల పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.