రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష(ఏపీసెట్)ను డిసెంబరు 20న నిర్వహించనున్నట్లు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుముతో అక్టోబరు 12 వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో అక్టోబరు 21 వరకు, రూ.5వేల అపరాధ రుసుముతో నవంబరు 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. డిసెంబరు 12 నుంచి www.apset.net.in వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఇదీ చదవండి:
తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్ అక్కర్లేదు: తితిదే ఛైర్మన్