ETV Bharat / city

గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల

author img

By

Published : Oct 29, 2020, 6:39 PM IST

Updated : Oct 29, 2020, 7:23 PM IST

gruop-1
gruop-1

18:18 October 29

గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలో దొర్లిన తప్పులను సరిచేసి ఏపీపీఎస్సీ మరోసారి ఫలితాలు ప్రకటించింది. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం గ్రూప్ -1 ప్రాథమిక పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను గురువారం వెల్లడించింది. psc.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ఉంచింది. దీనితో పాటు రీ షెడ్యూల్ చేసిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 14 నుంచి 20 వరకు వీటిని నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

నవంబర్ 2 నుంచి 13 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేలా గతంలో షెడ్యూలు విడుదలైంది. కానీ హైకోర్టు ఆదేశాలతో పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీ షెడ్యూల్ చేసిన తేదీలను ఏపీపీఎస్సీ వెల్లడించింది.  

Last Updated : Oct 29, 2020, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.