'మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ వ్యతిరేకిస్తున్నారు' - pcc sailajanadh fires on jagan
శాసన మండలి రద్దు నిర్ణయం జగన్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ వ్యాఖ్యానించారు. జగన్ సర్కారు చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలి రద్దు చేయాలనే నిర్ణయాన్ని సీఎం జగన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు.
'మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ వ్యతిరేకిస్తున్నారు'
By
Published : Jan 27, 2020, 8:32 PM IST
.
'మూడు రాజధానుల ప్రతిపాదనను అందరూ వ్యతిరేకిస్తున్నారు'
AP_hyd_21_27_APPCC_PC_Council_Revised_AB_3038066
Reporter; M. Tirupati Reddy
Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది.
() ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలిని రద్దు చేయడం జగన్ నియంతృత్వ పోకడకు నిదర్శనమని ఆంద్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు.జగన్ సర్కార్ చర్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఖ్యా బలం ఉంది కదా అని ఏదైనా చేస్తాను అంటే సరిపోదని విమర్శించారు. మూడు రాజధానుల ప్రతిపాదన వైసీపీ మినహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం రాజకీయ కక్షపూరిత చర్యగా ఆయన అభివర్ణించారు. రాజధాని తరలింపు బిల్లు మండలి సెలెక్ట్ కమిటీ కి పంపడంతో ప మండలిని రద్దు చేయాలను కోవడం అంటే .. జగన్ తన ఓటమిని ఒప్పుకున్నట్లు కాదా అని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేయడానికి రూ.1400 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. దాంతో పోలిస్తే .. మండలి నిర్వహణకు చేస్తున్న రూ.60 కోట్లు ఖర్చు ప్రభుత్వానికి ఏ మేరకు భారమో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే... మీరు ఉంటారా అన్న రీతిలో నియంతృత్వ ధోరణితో జగన్ మండలిని రద్దు చేస్తున్నారని ఆరోపించారు. నాడు స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన మండలిని జగన్ రద్దు చేయడం అంటే వై ఎస్ నిర్ణయాన్ని వ్యతిరేకించడమే కదా అని నిలదీశారు. మండలి రద్దు చేయాలనే తన నిర్ణయాన్ని జగన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బైట్: శైలజానాథ్, పీసీసీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్