ETV Bharat / city

సీఎం నివాసం సమీపంలో అపార్ట్​మెంట్​ వాసుల ధర్నా - latest news of cm jagan

తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస సమీపంలోని ఓ అపార్ట్​మెంట్ వాసులు ధర్నాకు దిగారు. అపార్ట్​మెంట్​లో ఓ వృద్ధురాలు కరోనా మృతి చెందటంతో వారిని క్వారంటైన్​లో ఉంచారు. కానీ క్వారంటైన్ గడువు ముగిసినా పోలీసులు బయటికి రానివ్వకపోవడంతో ఆందోళనకు దిగారు.

thadeapalli
thadeapalli
author img

By

Published : May 14, 2020, 5:59 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం జగన్ నివాస సమీపంలోని ఓ అపార్ట్​మెంట్ వాసులు ధర్నా నిర్వహించారు. గత నెలలో మారుతి అపార్ట్​మెంట్​లో కరోనా వైరస్​తో ఓ వృద్ధురాలు మృతిచెందారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్​గా అధికారులు గుర్తించారు. ముందస్తు చర్యలలో భాగంగా అపార్ట్ మెంట్​లోని అందరికీ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో అపార్ట్ మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని 14రోజులు లేదా 28రోజులు కంటోన్మెంట్ జోన్ ప్రకటించారు. పోలీసులు సైతం అపార్ట్ మెంట్ వాసులపై కఠిన ఆంక్షలు విధించారు. 14రోజుల పాటు ఎవర్నీ బయటకు వెళ్లనీయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 14 రోజులు ముగిసిన తర్వాత దీనిని 28 రోజులకు పొడిగించారు. తాజాగా 28రోజులు ముగిసినా పోలీసులు ఎవర్నీ బయటకు రానీయకపోవడంతో అపార్ట్​మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులను అడ్డుకున్నారు.

ఇదీ చదవండి :

కరోనా వస్తుందనే భయంతో బయటకు రాలేదా..?: బొత్స

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.