ETV Bharat / city

'కరోనా నియంత్రణ నిర్వహణకు రూ.805 కోట్లు అవసరం..' - ఏపీలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా నియంత్రణ నిర్వహణకు రూ.805 కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని ఏపీఎంఎస్ఐడీసీ ప్రభుత్వానికి నివేదించింది. కొవిడ్ సోకిన వారికి ఇచ్చే హోమ్ ఐసోలేషన్ కిట్లు, మందులు, మూడు లేయర్ల మాస్కులు, వైద్యులు, సిబ్బంది కోసం పీపీఈ కిట్లు, శానిటైజర్లు ఇతర పరికరాల కొనుగోళ్ల కోసం ఈ నిధులు అవసరం అవుతాయని స్పష్టం చేసింది. వీటిని తక్షణం మంజూరు చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు దస్త్రాన్ని పంపింది.

APMSIDC request government for corona funds
ఏపీఎంఎస్ఐడీసీ
author img

By

Published : Jun 2, 2021, 12:55 PM IST

రాష్ట్రంలో కొవిడ్ నియంత్రణ, నిర్వహణకు 805 కోట్ల రూపాయల్ని మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తక్షణం ఈ నిధుల్ని కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖను కోరింది. కొవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్​లో ఉన్న బాధితులకు ఐసోలేషన్ కిట్లు, మందులు, మూడు పొరల మాస్కుల సరఫరా అలాగే ఆస్పత్రుల్లో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం పీపీఈ కిట్లు, రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొనుగోలు, శానిటైజర్ల సేకరణ కోసం రూ.276 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఏపీఎంఐడీసీ పేర్కోంది.

మరోవైపు ల్యాబ్​లకు కావాల్సిన పరికరాలు, కొవిడ్ కిట్ల కోనుగోళ్ల కోసం రూ.176 కోట్లు అవసరమని స్పష్టం చేసింది. అలాగే వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ పైపులైన్లు మరమ్మతులు, ఇతర సివిల్ పనుల కోసం, తాత్కాలిక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా కోసం రూ.48 కోట్లు అవసరమని ఏపీఎంఐడీసీ ప్రభుత్వానికి నివేదించింది. మొత్తం ఈ పనుల కోసం రూ.500 కోట్లు, రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ ఆస్పత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి, తాత్కాలికంగా నియమించిన వారి వేతనాల కోసం రూ.147.99 కోట్లు, ఆస్పత్రుల్లో ఇతర ఖర్చుల కోసం రూ.157.19 కోట్లు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది.

ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు.. జాతీయ ఆరోగ్య మిషన్ గ్రాంటుగా రూ.559.61 కోట్లు, కేంద్ర, రాష్ట్ర విపత్తు సహాయ నిధుల నుంచి రూ.645.65 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.889 కోట్లు, జిల్లా ఖనిజ నిధులు రూ.133 కోట్లు ఖర్చు చేసినట్లు ఎపీఎంఎస్ఐడీసీ వెల్లడించింది.

ఇదీ చదవండి:

కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.