జగన్ ప్రభుత్వం.. ధరల వడ్డింపుల, వాయింపుల పాలన చేస్తుందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. కరోనా కష్టకాలంలో రేషన్, కందిపప్పు, చక్కెర ధర పెంచడం అమానుషమని ఆయన విమర్శించారు. మద్యపాన నిషేధం అని మద్యం ధరలు 75 శాతం పెంచారని దుయ్యబట్టారు.
జగన్ ఏడాది పాలన కాలంలో సిమెంటు ధర 150 నుంచి 300 రూపాయల వరకు పెరిగిందన్నారు. సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని, ఇసుక ధర నాలుగైదు రెట్లు పెరిగిందన్నారు. ఆర్టీసీ, పెట్రోల్, డీజిల్ , కరెంటు ఛార్దీలు పెంచేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని తులసిరెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి..