రాజధాని అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఉనికిని ప్రశ్నార్థకం చేసే తప్పు చేస్తున్నారని పీసీసీ చీఫ్ శైలజనాథ్ ధ్వజమెత్తారు. రాజధానిగా ఆనాడు అమరావతికి ఎందుకు మద్దతు తెలిపారో ఆయన సమాధానం చెప్పి తీరాలన్నారు. అభివృద్ధి ఆగిపోతే రాష్ట్రం వెనకబడుతుందని గ్రహించాలని హితవు పలికారు. రాజధానిగా అమరావతికి అన్ని అర్హతలున్నాయనీ.. ఆ దిశగా జగన్ ఆలోచన చేయాలన్నారు.
ఇదీ చదవండి: 'రాజధాని అమరావతిలోనే ఉండాలి: సోము వీర్రాజు'