దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ , రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీంతో ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు ,ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో ఉరుములు, మెరుపులుతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి వర్షాలు కురిస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులుతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇవీ చదవండి: