ETV Bharat / city

ap topnews ప్రధానవార్తలు@9am - ఆంధ్రప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

ఏపీ ప్రధానవార్తలు

ap topnews
ప్రధానవార్తలు@9am
author img

By

Published : Sep 24, 2022, 9:01 AM IST

  • సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు

సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అంటూ నియోజకవర్గ ఇంఛార్జ్‌లను.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంఛార్జిలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న అధినేత.., పార్టీ చేపడుతున్న కార్యక్రమాల పై ఆరా తీశారు. నాయకుల పనితీరుపై సమగ్ర సమాచారంతో వివిధ అంశాలపై లోతుగా సమీక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పనితీరు మార్చులకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.

  • గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసుల ఆంక్షలు

గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఐడీ కార్డులు ఉన్న రైతులనే పాదయాత్రకు అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు లేని వారిని అనుమతించటం లేదు. ఐడీ కార్డులు లేని కారణంగా రైతులను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • ఈ ఏడాది 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు

2021-22తో పోల్చితే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది. కరోనా వేళ దేశవ్యాప్తంగా సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. అయితే ఇది తమ సంస్కరణల ఫలితమేనంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం చేసుకుంది. కానీ తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించకపోవడంతోనే విద్యార్థులు మళ్లీ ప్రైవేటు బాట పట్టారు.

  • సీనియర్‌ జర్నలిస్టు అంకబాబుకు బెయిల్

సీనియర్​ జర్నలిస్ట్​ అంకబాబుకు గుంటూరు సీఐడీ కోర్టులో ఊరట లభించింది. గురువారం విజయవాడలో అంకబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. అంకబాబును రిమాండ్‌కు తరలించాలని సీఐడీ న్యాయవాదుల వాదనలు వినిపించగా.. రిమాండ్ రిపోర్ట్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ అంకబాబుకు రూ.25 వేల పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు.

  • వృథా నీటి వ్యాపారం.. కొనుగోలు, అమ్మకాల విధానంపై నీతి ఆయోగ్ కసరత్తు

వృథాగా వెళ్లే నీటిని మార్కెట్‌లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్‌ కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్లుగానే వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్‌ శ్రీకారం చుట్టింది.

  • శిందే వర్గానికి షాక్.. ఠాక్రే శివసేన ఆధ్వర్యంలోనే దసరా ర్యాలీ

ముంబయిలోని ప్రముఖ శివాజీ పార్క్‌ మైదానంలో దసరా ర్యాలీ నిర్వహణ విషయంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గానికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.

  • జర్నలిస్టుకు హిజాబ్‌ లేదని ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్‌ అధినేత..

జర్నలిస్టు హిజాబ్ ధరించలేదని ఇంటర్వ్యూకు గైర్హాజరయ్యారు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగించేందుకు ఇటీవల రైసీ న్యూయార్క్ వచ్చారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.

  • రూపాయి పతనం.. క్షీణిస్తున్న ఫారెక్స్​ నిల్వలు.. ఇలాగే అయితే కష్టమే!

భారత విదేశీ మారకపు నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ఏడాది వ్యవధిలో 96.45 బిలియన్ డాలర్ల నిల్వలు తగ్గిపోయాయి. రూపాయి విలువ క్షీణిస్తున్న నేపథ్యంలో.. ఆర్​బీఐ తీసుకునే చర్యల వల్ల ఫారెక్స్ నిల్వలు మరింత తగ్గే అవకాశం ఉంది.

  • మాస్టర్‌ బ్లాస్టర్‌ మెరుపు సిక్స్​.. అభిమానులు ఫిదా

పరుగులు అతడికి కొత్త కాదు. రికార్డులు లెక్కలేదు. మైదానంలో అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే. అతడే మాస్టర్​ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్​. అలనాటి సచిన్​ను మళ్లీ గుర్తుకు తెచ్చాడు ఈ లిటిల్​ మాస్టర్​. రోడ్​ సేఫ్టీ సిరీస్​లో భాగంగా అద్భుతమైన సిక్స్​ కొట్టి అదరహో అనిపించాడు.

  • తెలుగు సినిమాకు కొత్త హంగులు.. అంతర్జాతీయ స్థాయికి అగ్రదర్శకుల చిత్రాలు

తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ప్రపంచ స్థాయి సాంకేతికతను అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు తెలుగు అగ్ర దర్శకనిర్మాతలు వివిధ విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. విదేశీ నటులను కూడా సినిమాల్లోకి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా రాజమౌళి అమెరికాకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.