ETV Bharat / city

ఏపీ ప్రధానవార్తలు@7am - ఆంధ్రప్రదేశ్​ టాప్​ న్యూస్​

.

7am topnews
ఏపీ ప్రధానవార్తలు@7am
author img

By

Published : Sep 8, 2022, 7:04 AM IST

  • సీపీఎస్‌ రద్దు హామీ తొందరపాటన్న బొత్స.. జీపీఎస్​ ఒప్పుకునేది లేదన్న ఉద్యోగులు

ఎట్టి పరిస్థితుల్లోనూ సీపీఎస్​ రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్​కు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలావుంటే.. సీపీఎస్‌ రద్దు చేస్తామని ఏదో తొందరపాటులో హామీ ఇచ్చామని.. జీపీఎస్​లోనూ ఇంకా సదుపాయాలు పెంచుతామని మంత్రి బొత్స తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గాంధీపై దాడి జరిగితే స్పందించలేదేం?

కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్‌ చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేసినా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెదేపా లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సరైన రీతిలో స్పందించలేదని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చెన్నుపాటి గాంధీపై దాడి కేసు.. రిమాండ్​ రిపోర్ట్​ తిప్పిపంపిన కోర్టు

తెదేపా నేత చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే రిమాండ్​ రిపోర్ట్​ను కోర్టు తిప్పిపంపింది. 326 సెక్షన్​ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దానికి గల కారణాలను కోర్టులో సమర్పించలేకపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ప్రతివాదిగా ఏపీ ప్రభుత్వం

కస్టోడియల్‌ టార్చర్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. రెండున్నరేళ్లుగా రఘురామను రాష్ట్రానికి రాకుండా అడ్డంకులు సృష్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వమే కస్టోడియల్‌ టార్చర్‌కు గురిచేసిందని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అది థర్డ్‌ ఫ్రంట్‌ కాదు.. మెయిన్‌ ఫ్రంట్​ అంటున్న నీతీశ్‌..

ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో దిల్లీ పర్యటనకు వెళ్లిన బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్​ కుమార్​ మూడు రోజుల పర్యటన ముగిసింది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో భేటీ అయిన నీతీశ్​.. ఎప్పుడైనా అది థర్డ్‌ ఫ్రంట్‌ కాదు.. మెయిన్‌ ఫ్రంట్‌ అవుతుందని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​ జోడో యాత్ర షురూ.. రాహుల్​ నేతృత్వంలో దేశమంతా..

2024 సార్వత్రిక ఎన్నికలు, పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 'భారత్ జోడో' యాత్ర మొదలైంది. పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు తలపెట్టిన యాత్రను ప్రారంభించారు. 12 రాష్ట్రాల నుంచి 3,570 కిలోమీటర్ల పొడవున ఈ పాదయాత్ర సాగనుంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం సహా దేశంలో భాజపాయేతర శక్తులను కూడగట్టాలని హస్తం పార్టీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రపంచ విద్యుత్ సంక్షోభం.. ఐరోపా, చైనాల్లో కరెంట్‌ కోతలు..

ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యుత్‌ రంగంలో సంక్షోభ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, ప్రకృతి ప్రకోపం, తీవ్రమైన ఎండలు, యూరప్​లో కరవు తోడవడం వల్ల విద్యుత్ రంగం సంక్షోభం దిశగా సాగుతోంది. చైనా, అమెరికాలో సైతం ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కార్పొరేట్‌ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

వడ్డీ రేట్లు పెరుగుతుండటంతో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్లు తమ డిపాజిట్‌ రేట్లను సవరించడం ప్రారంభించాయి. ముఖ్యంగా కార్పొరేట్‌లు తమ నిధుల అవసరాల కోసం స్వల్పకాలిక డిపాజిట్లను ప్రకటించడం ప్రారంభించాయి. అధిక వడ్డీ వస్తుందని వీటిని ఎంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఊరట విజయం కోసం టీమ్​ఇండియా ఎదురుచూపులు.. నేడు అఫ్గానిస్థాన్​తో ఢీ

టైటిల్​ ఫేవరెట్​గా ఆసియా కప్ టోర్నీలోకి అడుగుపెట్టిన టీమ్​ఇండియా.. అనూహ్యంగా ఫైనల్​కు దూరమైంది. తన చివర మ్యాచ్​లో నేడు అఫ్గానిస్థాన్​తో భారత్​ క్రికెట్ జట్టు తలపడనుంది. ఫైనల్‌ దారులు ఎలాగూ మూసుకుపోయిన నేపథ్యంలో.. కనీసం లోపాలన్నా సరిదిద్దుకుని జట్టుగా గాడిన పడాలన్నది టీమ్‌ఇండియా ఉద్దేశం. అఫ్గానిస్థాన్‌ను తక్కువ అంచనా వేస్తే అది పొరపాటే అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ దూకుడేది?.. తెలుగులో స్పీడ్​ తగ్గించిన స్టార్‌ హీరోయిన్లు!

సంక్రాంతికి ఒకటి.. వేసవికి ఇంకొకటి.. దసరాకు మరొకటి.. అంటూ సీజన్‌కు ఒకటి చొప్పున ఏడాది మొత్తం వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు కథానాయికలు. ఇక వరుసగా రెండు హిట్లు కొట్టి.. స్టార్‌ నాయికల జాబితాలో చేరారంటే ఆ జోరు రెట్టింపవ్వాల్సిందే. అనుష్క, తమన్నా, రకుల్‌, రష్మిక, పూజా హెగ్డే తదితరులంతా ఇలా వరుస చిత్రాలతో సందడి చేసిన వాళ్లే. ఇప్పుడీ నాయికలంతా బొత్తిగా నెమ్మదించేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.