- నవంబరు 2 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
నవంబరు 2వ తేదీ నుంచి పాఠశాలలు తెరుస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. నవంబరు నెలలో పాఠశాలల నిర్వహణ ప్రణాళికను సీఎం ప్రకటించారు. 1, 3, 5, 7 తరగతులకు ఒకరోజు 2, 4, 6, 8 తరగతులకు మరోరోజున తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్య 750కి మించితే మూడ్రోజులకొకసారి తరగతుల నిర్వహణ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రంలో తాజాగా 3,503 కరోనా కేసులు, 28 మరణాలు
రాష్ట్రంలో తాజాగా 3,503 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 7,89,553కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 6,481 మంది మృతి చెందారు. ప్రస్తుతం 33,396 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వచ్చే నాలుగైదు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
వచ్చే నాలుగైదు గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వరద బాధితులకు తక్షణమే సాయం అందించండి: సీఎం జగన్
వరదలు, కరోనా నివారణ చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వరద బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షలు పరిహారం అందించాలన్నారు. ఈ నెల 31లోగా పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలని కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. రైతు భరోసా నగదును ఈ నెల 27న జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: మోదీ
కరోనాపై జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి చేరవేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైరస్ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న సంతోషాలు దూరమైపోతాయని హెచ్చరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'మోదీజీ.. చైనా సైన్యాన్ని ఎప్పుడు పంపుతారో చెప్పండి'
భారత భూభాగం నుంచి చైనా సైనికుల్ని ఎప్పుడు వెనక్కి తరముతారో తెలుసుకోవాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. చైనా గురించి ప్రధాని నరేంద్రమోదీ కనీసం పెదవి విప్పడం లేదని రాహుల్ ఆక్షేపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సాగు చట్టాల గురించి సగం మంది రైతులకు తెలీదు!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను సమర్థిస్తున్న, వ్యతిరేకిస్తున్న రైతుల్లో 52 శాతం మందికి అసలు వాటి గురించి తెలియదని ఓ సర్వేలో తేలింది. ఈ చట్టాలను 52 శాతం మంది రైతులు వ్యతిరేకించగా.. 35 శాతం మంది సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. మోదీ ప్రభుత్వం రైతులకు అండగా ఉందని 35 శాతం మంది చెబితే.. ప్రైవేటు కంపెనీలు/కార్పొరేట్ సంస్థలకు మద్దతిస్తోందని 20 శాతం మంది రైతులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అధ్యక్ష పోరు: ట్రంప్‌కు ఇదే ఆఖరి అవకాశమా?
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. ఎలక్షన్ డే (నవంబర్ 3)కు ముందే దాదాపు 2.2కోట్ల ముంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ట్రంప్‌పై బైడెన్ క్రమంగా పైచేయి సాధిస్తున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. కీలక రాష్ట్రాల్లో డెమొక్రాట్లు దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ వేగంగా పుంజుకోకపోతే.. పరాభవం తప్పదంటున్నారు విశ్లేషకులు. అందుకే... ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి డిబేట్‌ను అవకాశంగా మల్చుకోవాలని చూస్తోంది ట్రంప్ బృందం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- బీచ్‌లో సరదాగా గడుపుతోన్న చాహల్-ధనశ్రీ
దుబాయ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతున్నాడు బెంగళూరు జట్టు ఆటగాడు యుజువేంద్ర చాహల్. దీనికి సంబంధించి ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సినీనటుడు పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ విషయాన్ని నటుడి సోషల్‌మీడియా బృందం ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏ సమాచారం ఇవ్వలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి