ETV Bharat / city

ప్రధానవార్తలు@11am - 11am టాప్​ న్యూస్​

.

11am topnews
ప్రధానవార్తలు@11am
author img

By

Published : Sep 19, 2022, 10:58 AM IST

  • తెలుగుదేశం శాసనసభాపక్షం నిరసన ర్యాలీ ఉద్రిక్తం

తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్న ఎడ్ల బండ్లను తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఎండ్లను పోలీస్‌స్టేషన్‌ నుంచి దూరంగా తరలించి టైర్లలోని గాలి తీసేశారు. ఈ విషయంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడ్లను అరెస్టు చేయడమేంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఫలితంగా అసెంబ్లీ పరిసరాల బయట ఉద్రిక్తత నెలకొంది. ఎడ్లబండి కాడె మోస్తూ అసెంబ్లీకి లోకేష్ నిరసన ర్యాలీ చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రుణ యాప్​లు వేధిస్తున్నాయా.?.. అయితే ఈ సెక్షన్స్ గురించి తెలుసుకోండి..

ఒక్కసారి అప్పు తీసుకుని, వడ్డీ సహా మొత్తం రుణం తీర్చేసినా ఇంకా చెల్లించాల్సి ఉందంటూ వేధింపులు... మార్ఫింగ్‌ చిత్రాలతో మానసిక క్షోభకు గురిచేసేంతగా అకృత్యాలు.. అప్పు తీరుస్తావా? లేదంటే పరువు తీసేయాలా? అనే బెదిరింపులు.. ఇలా ఒకటేమిటి ఆన్‌లైన్‌ రుణయాప్‌ల నిర్వాహకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేదు. వీరి బారిన పడి పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య

పల్నాడు జిల్లాలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. మహిళను హత్య చేసిన ఘటనలో పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధిత కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేలిముద్రల చోరీతో నగదు లూటీ

బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రలను చోరీచేసి వారి ఖాతాల్లోని నగదును అత్యంత సునాయాసంగా మాయం చేస్తున్న ఉదంతాలు విశాఖ నగరంలో వెలుగుచూస్తుండడం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పోలీసులకు అందిన ఫిర్యాదుల ప్రకారం బాధితులకు చెందిన రూ.1.50కోట్లకు పైగా నగదును వారి ఖాతాల నుంచి దర్జాగా ఉపసంహరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 4,858 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 18 మంది చనిపోయారు. ఒక్కరోజులో 4,735 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.11 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత సైన్యం సరికొత్త రణనీతి.. అరుణాచల్​లో శత్రువులకు చెక్!

భారత సైన్యం అమలు చేస్తున్న సరికొత్త వ్యూహంతో అరుణాచల్​ ప్రదేశ్​లోని ఉత్తర ప్రాంతాల్లో యుద్ధరీతులే మారిపోతాయి. ఇక్కడ మన సైన్యం చేపడుతున్న మార్పుల్లో ఐబీజీలు ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ దిశగా 2019లో 'హిమవిజయ్‌' పేరుతో నిర్వహించిన వినూత్న సైనిక విన్యాసాల్లో నేర్చుకున్న పాఠాలను ఆచరణలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మూడోసారీ 'పిల్ల' ప్రభావం.. వందేళ్లలో ఇదే తొలిసారి

ఎల్‌ నినో అంటే పిల్లాడు; లా నినా అంటే పిల్ల అని స్పానిష్‌ భాషలో అర్థం! వాతావరణంలో సంభవించే పరస్పర విరుద్ధ పరిణామాలను ఈ పేర్లతో పిలుస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ అమెరికా తీరం, భూమధ్య రేఖ వెంబడి పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలంపై అసాధారణ వేడి లేదా.. చల్లదనం లాంటివి నమోదవుతుంటాయి. ఈ పరిణామాలను ఎల్‌ నినో సదరన్‌ ఆసిలేషన్‌ సిస్టమ్‌ (ఇఎన్‌ఎస్‌ఓఎస్‌) అంటుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'క్రెడిట్‌ కార్డ్' vs 'బయ్ నౌ పే లేటర్'.. రెండింట్లో ఏది బెటర్?

పండగలు వచ్చేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పలు ఆఫర్లూ సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇ-కామర్స్‌ దిగ్గజాలు తమ రాయితీ అమ్మకాల తేదీలనూ ప్రకటించాయి. మరోవైపు కొనుగోలుదారులూ వీటిని నిశితంగా గమనిస్తున్నారు. రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండగ కొనుగోళ్లు అధికంగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ కార్డు, 'ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి' (బీఎన్‌పీఎల్‌) ప్రధాన పాత్ర పోషించనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'విరాట్ కోహ్లీతో తిప్పలు తప్పవు.. అతడు మాకు సవాలే'

దాదాపు మూడేళ్ల తర్వాత శతకం సాధించి ఫామ్‌ అందుకొన్న విరాట్ కోహ్లీ (276) ఆసియా కప్‌లో అదరగొట్టాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్‌తో టీ20లకు సిద్ధమైపోయాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా సెప్టెంబర్‌ 20న తొలి మ్యాచ్‌ జరగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మంచి ట్రెండ్​లో ఉన్నాం.. 'తగ్గేదే లే'!

శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం 'అల్లూరి'. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం జరిగింది. దీనికి ప్రముఖ కథానాయకుడు అల్లు అర్జున్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా తర్వాత సినిమాకు ఆదరణ పెరిగిందని.. మంచి కంటెంట్​ ఉంటే భయపడే అవసరం లేదన్నారు. ఇంకా ఏమన్నారో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.