- విలీన గ్రామాల ప్రజలు నమ్మకం కోల్పోయారు: చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కోల్పోవడం వల్లనే తెలంగాణలో కలపాలని విలీన గ్రామాల ప్రజల డిమాండ్ చేస్తున్నారని.. తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన చెందారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంకకు వచ్చిన పరిస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదు: తులసిరెడ్డి
ఈడీ, సీబీఐ వంటి సంస్థలను కేంద్రంలోని భాజపా.. ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్షపూరిత రాజకీయాలకు ఉపయోగిస్తుందని.. కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మూడేళ్లలో జగన్ పాలనలో అప్పులు ఎక్కువయ్యాయని.. రాష్ట్రంలో శ్రీలంకకు వచ్చిన పరస్థితులు రావటానికి ఎంతో సమయం పట్టదని విమర్శించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీఎస్ఆర్టీసీ కార్గో డోర్ డెలివరీ.. సెప్టెంబర్ నుంచి ప్రారంభం
ఏపీఎస్ఆర్టీసీ కార్గో విభాగం.. డోర్ డెలివరీ సదుపాయం కల్పించనుంది. 50కేజీల వరకు మీరు బుకింగ్ చేసిన పార్శిల్, కొరియర్స్‌ను ఇంటి వద్దకే చేర్చనుంది. ఈ సేవలను ఆర్టీసీ సెప్టెంబరు 01వ తేదీ నుంచి ప్రారంభించనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- గడపగడపకు నిలదీతలు.. వైకాపా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
గడగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా ఎమ్మెల్యేలకు నిరసన సెగలు తప్పటం లేదు. ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేలను, మంత్రులను ఎక్కడిక్కడ నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా.. కోనసీమ జిల్లా తాళ్లరేవు మండలం దిండి గ్రామంలో ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌ను మహిళలు తమ సమస్యలపై నిలదీశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ''పర్యావరణాన్ని కాపాడుకుందాం'.. రాష్ట్రపతిగా నేనిచ్చే ఏకైక సందేశం అదే'
ప్రపంచంలోనే అత్యంత ఉత్తమ దేశాల్లో ఒకటిగా నిలిచేందుకు భారత్ సిద్ధమవుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో దేశప్రజలనుద్దేశించి కోవింద్ ప్రసంగించారు. పర్యావరణాన్ని కాపాడుకోవాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ముర్ము ప్రమాణానికి సర్వం సిద్ధం.. ఆదివాసీ సంప్రదాయాలతో వైభవంగా..
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సమక్షంలో.. ఆమె ప్రమాణస్వీకారం జరగనుంది. అనంతరం ముర్ము రాష్ట్రపతి హోదాలో ప్రసంగిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రధాని రేసులో వెనుకంజ.. అంగీకరించిన రిషి.. 'అయినా తగ్గేదేలే!'
భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవికి అడుగు దూరంలో ఉన్నారు. తుదిపోరులో సైతం గెలిస్తే బ్రిటన్‌ను పాలించే తొలి భారత మూలలున్న వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు. ఈ నేపథ్యంలో విడుదలైన ఓ సర్వే సంచలన విషయాలు బయట పెట్టింది. ఎంపీల ఓట్లు సాధించడంలో రిషి సునాక్ అగ్రస్థానం సొంతం చేసుకున్నా.. కీలకమైన కన్జర్వేటివ్ సభ్యుల ఓట్లు పొందడంలో వెనకబడి ఉన్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- 'రాష్ట్రాల కోరిక మేరకే వాటిపై జీఎస్టీ.. నిర్ణయం కేంద్రానిది కాదు'
రాష్ట్రాలు చేసిన అభ్యర్థన ప్రకారమే ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. జీఎస్టీ విధించాలన్న నిర్ణయం జీఎస్టీ మండలి ఏకాభిప్రాయంతో తీసుకుందని, అందులో అన్ని రాష్ట్రాలు భాగమేనని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ పని తొందర పడి చేయలా, గర్వపడి చేశా: చిరంజీవి
ఆమిర్‌ఖాన్, నాగచైతన్య నటించిన 'లాల్‌సింగ్ చడ్డా' తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆమిర్‌పై తనకున్న అభిమానాన్ని తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
- విశ్వ వేదికపై మరోసారి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లోనూ ఒలింపిక్ ఛాంపియన్, భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తా చాటాడు. ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో.. రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడీ 24 ఏళ్ల స్టార్. డిఫెండింగ్ ఛాంపియన్, గ్రెనెడాకు చెందిన అండర్సన్ పీటర్స్ మరోసారి విజేతగా నిలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధానవార్తలు @9PM - AP TOP NEWS
.
ప్రధానవార్తలు