ETV Bharat / city

AP TOP NEWS: ప్రధానవార్తలు @9PM - ప్రధానవార్తలు @9PM

.

ప్రధానవార్తలు
ప్రధానవార్తలు
author img

By

Published : Jul 20, 2022, 9:00 PM IST

రామాయపట్నం పోర్టుతో మెరుగైన ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
రామాయపట్నం పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయని సీఎం జగన్‌ అన్నారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మొండివారిపాలెంలో పోర్టు నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన సీఎం..రాష్ట్రంలో ఉన్న ఆరు పోర్టులకు తోడు మరో నాలుగు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే మిగిలిన వాటికీ భూమి పూజ చేస్తామని చెప్పారు.

రాష్ట్రం శ్రీలంక దిశగా సాగుతోందని కేంద్రం కూడా చెప్పింది: పయ్యావుల
రాష్ట్రంలోనూ శ్రీలంక పరిస్థితులు నెలకొంటాయని 4 నెలల క్రితమే తెలుగుదేశం పార్టీ హెచ్చరించిందని... అదే విషయాన్ని నిన్న కేంద్రం మరోసారి తెలిపిందని పయ్యావుల కేశవ్‌ వివరించారు.

CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలు.. సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ సినీనటుడు చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యకమవుతున్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను భాషాదోషంగా పరిగణించాలని చిరంజీవి అభిమానులకు నారాయణ విజ్ఞప్తి చేశారు.

తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్​బ్యాంకు ఎన్నికలపై.. హైకోర్టు సీజేకు ఫిర్యాదు
తిరుపతి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు ఎన్నికలపై హైకోర్టు సీజేకు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఫిర్యాదు చేశారు. అన్యాయంగా తమను పోలీసులు నిర్బంధించారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీజేను కోరారు.

జీఎస్టీ బాదుడుపై విపక్షాల నిరసన.. ఉభయ సభలు వాయిదా
లోక్​సభ గురువారానికి వాయిదా పడింది. ధరల పెరుగుదల, రోజువారీ వస్తువులపై జీఎస్టీ విధింపునకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనలు చేస్తుండటం వల్ల సభాకార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగింది.

'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యాలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

సవాళ్ల లంకకు సారథిగా రణిల్.. ద్వీపదేశం గట్టెక్కేనా?
తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు రణిల్ విక్రమసింఘె(73). బుధవారం పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించగా.. మెజార్టీ సభ్యులు రణిల్​కే మద్దతు పలికారు. మొత్తం 225 మంది సభ్యుల్లో 134 మంది ఆయనకు ఓటేశారు.

స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 600 ప్లస్​.. '80' వద్ద రూపాయి
దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 629 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడ్డాయి.

Laal Singh chaddha: 'బాలరాజు'ను పరిచయం చేసిన మెగాస్టార్​ చిరంజీవి
'లాల్‌సింగ్‌ చడ్డా'లోని హీరో నాగచైతన్య లుక్​ను రిలీజ్​ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు తెలిపారు.

టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ స్పెషల్ టూర్‌.. ఫొటోస్​ అదిరాయిగా
టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీ ప్రపంచమంతా చుట్టేస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలోని ప్రకృతి సౌందర్య ప్రాంతం గ్రేట్ బ్యారియర్‌ రీఫ్‌కు చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.