- బిరబిరా కృష్ణమ్మ.. ప్రకాశం బ్యారేజీ గేట్లెత్తిన అధికారులు!
ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండడంతో.. అధికారులు గెట్లెత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
- వైకాపాకు బాధ్యత గుర్తు చేస్తున్నాం : పవన్ కల్యాణ్
జగన్ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తించాలో గుర్తు చేస్తున్నామని.. అందుకోసమే "జనవాణి" కార్యక్రమం నిర్వహిస్తున్నామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వరుసగా రెండో ఆదివారం విజయవాడలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. సాయంత్రం మీడియాతో మాట్లాడిన పవన్.. తాను సంపూర్ణంగా దహనం కావడానికి సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు.
- "మహారాష్ట్ర సీన్ ఇక్కడా రిపీట్.. అతడు సీఎం అవుతాడని జగన్‌కు భయం"
ఎన్నటికైనా తనను దించేసి.. ఓ మంత్రి సీఎం అవుతారనే భయం జగన్‌కు పట్టుకుందని తెదేపా నేత బుద్ధా వెంకన్న అన్నారు. మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలోనూ జరగనున్నాయని జోస్యం చెప్పారు.
- ప్లీనరీ మొత్తం అబద్ధాల పుట్ట : సోము వీర్రాజు
రాష్ట్రంలో భాజపా రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్లీనరీలో వైకాపా చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఆక్షేపించారు.
- దేశంలో ఆధ్యాత్మిక శోభ... ఘనంగా బక్రీద్, ఏకాదశి వేడుకలు
దేశంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ముస్లింలు భక్తిశ్రద్ధలతో బక్రీద్ పర్వదినాన్ని జరుపుకొంటున్నారు. ఈద్ ఉల్ అదా సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరోవైపు, తొలి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు.. దేవాలయాలకు పోటెత్తారు. ఈ పండగల సందర్భంగా రాష్ట్రపతి, ప్రధాని, పలువురు రాజకీయ నాయకులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
- దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి.. అసెంబ్లీ రద్దు చేస్తా : కేసీఆర్
CM KCR Comments on Modi: "కేంద్రంలోని భాజపా ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే.. నేను కూడా అసెంబ్లీని రద్దు చేస్తా. తేదీ ఖరారు చేస్తే.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తాం. రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్నాథ్ శిందేలను తీసుకురావాలి" అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు.
- కుటుంబ పెత్తనం, అవిరామ దోపిడీ.. నలుగురు కలిసి.. శ్రీలంకను నరకంలోకి నెట్టి..
గత కొన్ని నెలలుగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను డిమాండ్ చేస్తున్న లంక ప్రజల నిరసన శనివారం పతాకస్థాయికి చేరుకుంది. రాజపక్స కుటుంబం చేసిన తప్పిదాలే శ్రీలంక సంక్షోభానికి కారణమయ్యాయని ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరి ఆరోపణలు పూర్తిగా అవాస్తవమేమీ కాదు. నియంత పోకడలతో రాజపక్స కుటుంబం సాగించిన పాలన శ్రీలంక సంక్షోభానికి దారితీసింది!
- హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? ఇవి తెలుసుకోండి!
అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా ఆదుకుంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థ మనం పరిహారం కోసం చేసిన క్లెయింను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఏ పరిస్థితుల్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది? దాన్ని నివారించేందుకు ఏం చేయాలో చూద్దాం..
- 'సినీ పరిశ్రమకు భూతంలా 'ఓటీటీ''
ప్రస్తుత రోజుల్లో థియేటర్లకు ప్రజలను రప్పించడం చాలా కష్టమవుతోందని అన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. సినీ పరిశ్రమ పాలిట ఓటీటీ ఓ భూతంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తాను సమర్పించిన 'పండుగాడ్' చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
- డైనోసర్‌లా 'పంత్'.. టీ20 వరల్డ్‌కప్ ప్రోమోతో ఐసీసీ సర్ప్రైజ్!
తనదైన శైలిలో బ్యాట్‌తో అదరగొడుతున్న టీమ్ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ రిలీజ్ చేసిన 2022 టీ20 వరల్డ్‌కప్ ప్రోమోలో పంత్‌ను డైనోసర్‌లా పైకి లేచి వస్తున్నట్లు చూపించింది. అభిమానులకు తెగ నచ్చేస్తున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM - AP NEWS
.
ప్రధాన వార్తలు