- ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు.. ప్రకటన చేశారు. సైనిక ఆపరేషన్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.
- Ayyanna: అయ్యన్న ఇంటి వద్ద పశ్చిమ గోదావరి జిల్లా పోలీసుల మోహరింపు
విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు నివాసం సమీపంలో పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు భారీగా మోహరించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో.. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో.. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారంటూ వైకాపా నేత రామకృష్ణ.. అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు. 153-A, 505(2), 506 I.P.C. సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అయ్యన్న ఇంటికి నోటీసు అంటించారు. ఆయన ఇంటివద్దకు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు.
- Notices To Theaters: రాష్ట్రంలో థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు
AP Govt Advance Notices To Theaters: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' చిత్రం శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో.. థియేటర్లకు ప్రభుత్వం ముందస్తు నోటీసులిచ్చింది. బెనిఫిట్ షోలు, అదనపు ప్రదర్శనలు వేస్తే.. కఠిన చర్యలు తప్పవంటూ.. అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
- YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. వాచ్‌మ్యాన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు
Viveka Murder Case: వై.ఎస్. వివేకా హత్య ఘటనలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వివేకా ఇంట్లో వాచ్‌మ్యాన్‌గా పనిచేసే బి. రంగన్న మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వివేకానందరెడ్డి ఇంటివద్ద రాత్రి కాపలాదారుగా పనిచేసే రాజశేఖర్ కాణిపాకం నుంచి ఎప్పుడు వస్తారో ఫోన్ చేసి కనుక్కోవాలంటూ ఎర్ర గంగిరెడ్డి తనను ఆదేశించారని రంగన్న తెలిపారు. ఆయన సెల్ఫోన్లో బ్యాలెన్స్ లేదంటూ.. తన ఫోన్ నుంచే రాజశేఖర్‌కు కాల్ చేసి మాట్లాడించారని పేర్కొన్నారు. అదే రోజు రాత్రి వివేకా హత్యకు గురయ్యారని చెప్పారు.
- Amaravati Protest: అమరావతి ఉద్యమానికి 800 రోజులు.. నేడు ప్రత్యేక కార్యక్రమాలు
అమరావతి ఆశలు అడియాసలు కాకుండా.. రోడ్డెక్కి గళమెత్తారు..! అరెస్టులకు అదరకుండా.. సమరశంఖం పూరించి..ఉద్యమ పిడికిలి బిగించారు..! అడ్డంకులు, నేతల వ్యాఖ్యలు, అవమానాల్ని భరిస్తూనే.. సంకల్పాన్ని స్పష్టంగా చెప్పారు..! జోరుగా వర్షాలు కురుస్తున్నా.. పాదాలు కందిపోతున్నా.. అడుగులు ముందుకే పడ్డాయి. మీ వెనుక మేమూ ఉన్నామంటూ...ఆయా ప్రాంతాల్లో... ప్రజలూ వెంటనడిచారు..! ఇలా.. ఇవాళ్టితో 800వ రోజుకు చేరిన రాజధాని ఉద్యమంపై...ప్రత్యేక కథనం.
- మణిపుర్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రవాదుల ప్రభావం!
Manipur news: మణిపుర్ ప్రజలపై తీవ్రవాదుల ప్రభావం ఇంకా బలంగా ఉంది. ఇక్కడ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీల్లోని నాయకులు తీవ్రవాద సంస్థలతో సంబంధాలు నెరుపుతుంటారని మణిపుర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
- యూపీలో సంక్షేమ పథకాలపైనే భాజపా ఆశలు
UP assembly election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎన్నికల్లో తమకు కలిసొస్తాయని భాజపా భావిస్తోంది. లబ్ధిదారులు తమకు అండగా నిలుస్తారని విశ్వసిస్తోంది. విపక్ష ఎస్పీ సైతం సంక్షేమ మంత్రంతోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.
- షేర్లు కొంటే మర్నాడే డీ మ్యాట్ ఖాతాలో జమ
T plus 3 settlement: షేర్ల ట్రేడింగ్ పూర్తయిన మర్నాడే డీమ్యాట్ ఖాతాలో జమ చేసే విధానం ఈనెల 25 నుంచి దశలవారీగా అమల్లోకి రానుంది. ఈ పద్ధతిని మొదలు పెట్టేందుకు స్టాక్ ఎక్సేంజీలు, డిపాజిటరీలు సిద్ధమవుతున్నాయి.
- ముందుగానే సమ్మర్ సునామీ.. గ్యాప్ లేకుండా సినిమాలు!
upcoming Big movies released dates: కరోనా పరిస్థితుల వల్ల గడిచిన రెండేళ్లు సినీ క్యాలెండర్లో వేసవి వినోదాల సందడి కనిపించలేదు. అయితే ఈ సారి కరోనా ముప్పు తగ్గడం వల్ల వేసవి సినీ మారథాన్ కాస్త ముందుగానే వచ్చేసింది. బడా హీరోల చిత్రాలన్నీ వరుసగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ అవేంటో చూసేద్దాం..