- దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు
- భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు రావడం వల్ల దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం. ఈయనకు యాంజియోప్లాస్టీ చేయనున్నారట. ఈయన త్వరగా కోలుకోవాలని మాజీ క్రికెటర్ ఇర్పాన్ పఠాన్ ట్వీట్ చేశారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- వ్యాయామానికి బ్యాక్టీరియా జోడిస్తే.. షుగర్‌కు చెక్!
- మధుమేహం.. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం వేధించే ఓ పెద్ద సమస్య. ఇది వచ్చాక బాధపడటం కంటే.. రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు నిపుణులు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రెండ్రోజుల్లో తెలంగాణ -ఏపీల మధ్య ఆర్టీసీ సర్వీసులు!
- మరో రెండ్రోజుల్లో తెలంగాణ-ఏపీ రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సర్వీసుల ఆర్టీసీ చర్చలు కొలిక్కివచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్షా 60వేల కిలోమీటర్లకు రూట్‌మ్యాప్‌ను తయారు చేసి తెలంగాణ ఆర్టీసీ అధికారులకు ఏపీ అధికారులు పంపించారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25వేలు ఇవ్వాలి: నారా లోకేశ్
- పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25 వేలు ఇవ్వాలని తెదేపా నేత నారా లోకేశ్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటించిన ఆయన... వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- సరికొత్త పీపీఈ కిట్‌తో శ్వాస సమస్యలకు స్వస్తి
- పీపీఈ కిట్లు ధరించటం వల్ల తలెత్తుతున్న వేడి, శ్వాస తీసుకునే ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు సరికొత్త పరికరాన్ని అభివృద్ధి చేశారు కేరళ తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునాల్ వైద్య కళాశాల శాస్త్రవేత్తలు. గంటల తరబడి పీపీఈ కిట్లు ధరించే ఆరోగ్య సిబ్బందికి 'పవర్డ్ ఎయిర్ ప్యూరిఫయింగ్ రెస్పిరేటర్'(పీఏపీఆర్)తో ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- యాంటీ షిప్ మిసైల్ ప్రయోగం విజయవంతం
- భారత నావికాదళం మరో నౌకా విధ్వంసక క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ట్విట్టర్లో ప్రయోగానికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- వాట్సాప్‌లో ఆ నోటిఫికేషన్స్ ఇక ఎప్పటికీ రావు!
- వాట్సాప్‌లో అనవసర సందేశాలతో విసుగు చెందేవారు ఇక ఉపశమనం పొందనున్నారు. వీటి నుంచి తప్పించుకునేందుకు సరికొత్త ఫీచర్‌ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది ఆ సంస్థ. నోటిఫికేషన్స్‌ను శాశ్వతంగా మ్యూట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక ఏడాదిగా ఉన్న మ్యూట్ ఆప్షన్లలో 'ఆల్వేస్'ను చేర్చింది. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్‌కు గిన్నిస్ రికార్డు
- దుబాయ్‌లో నిర్మించిన అతిపెద్ద ఫౌంటెయిన్ అక్టోబర్ 22న ప్రారంభమైంది. సముద్ర జలాల్లో 14 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫౌంటెయిన్‌లో 3 వేల ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఇప్పుడిది ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్గా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- డుప్లెసిస్ డ్రింక్స్ మోయడం చూడలేకపోయాను!
- అశ్విన్‌తో జరిగిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు స్పిన్నర్ తాహిర్. గతడేది ఐపీఎల్లో డుప్లెసిస్ డ్రింక్స్ ఇస్తుంటే చూడలేకపోయానని అన్నాడు.పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రతి ఒక్కరి హృదయాల్లో డార్లింగ్.. మన ప్రభాస్
- డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి