ETV Bharat / city

పదో తరగతి పిల్లలతో 'ఫలితాల ఆట'.. అనివార్యమంటూ విడుదల వాయిదా

author img

By

Published : Jun 4, 2022, 11:22 AM IST

Updated : Jun 5, 2022, 5:49 AM IST

11:19 June 04

పదో తరగతి పిల్లలతో 'ఫలితాల ఆట'.. అనివార్యమంటూ విడుదల వాయిదా

విద్యాశాఖ మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయ లోపం... ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో పదో తరగతి పరీక్షల ఫలితాలు వాయిదా పడ్డాయి. శనివారం విడుదల చేయాల్సిన ఫలితాలను ఎలాంటి కారణం లేకుండానే సోమవారానికి వాయిదా వేశారు. రాష్ట్రంలోని 6.22 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఒత్తిడి, ఆందోళనను పట్టించుకున్న దాఖలాలే లేవు. వాయిదాకు ‘అనివార్య కారణాలు’ అని మాత్రమే ప్రకటించారే తప్ప అధికారులెవ్వరూ మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడించలేదు. ఫలితాలు వస్తాయని ఎదురు చూసిన విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వ ప్రకటనతో నిర్ఘాంతపోయారు. రెండేళ్ల తర్వాత నిర్వహించిన పదోతరగతి పరీక్షలు ప్రారంభం నుంచి ఫలితాల విడుదల వరకు అంతా అయోమయంగానే మారాయి. పరీక్షల సమయంలో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు సామాజిక మాధ్యమాల్లో వచ్చేశాయి. దీంతో పరీక్షలకు బాగా సన్నద్ధమైన విద్యార్థులు ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఫలితాల విడుదలపైనా స్పష్టత కొరవడింది.

ఫలితాలను శనివారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు... 11.20 గంటల సమయంలో సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయ ప్రాంగణంలో ఫలితాలను వెల్లడిస్తామన్న అధికారులు అక్కడికి రాకుండానే వాట్సప్‌లో సమాచారం పంపారు. కొన్ని అనివార్య కారణాలతో తేదీని మార్పు చేశామన్నారు. దాంతో ఫలితాలు వస్తాయని ఉదయం నుంచే ఇంటర్నెట్‌ కేంద్రాలు, కంప్యూటర్ల ముందు కూర్చొని ఎదురుచూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు... ఈ ప్రకటనతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇప్పటివరకున్న సంప్రదాయం ప్రకారం విద్యాశాఖ మంత్రే పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ స్థానికంగా అందుబాటులో లేని కారణంగా ఆయన అనుమతితోనే విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేస్తారని అధికారులు పేర్కొన్నారు. సీఎం కార్యాలయం మాత్రం వాయిదా వేయాలని ఆదేశించినట్లు తెలిసింది. స్పష్టమైన తేదీని ప్రకటించకుంటే మరింత అయోమయం ఏర్పడుతుందనే ఉద్దేశంతో సోమవారానికి మార్పు చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే... మంత్రి, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతోనే ఇలా జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా బొత్స బాధ్యతలు చేపట్టాక తొలి ఫలితాలు ఇవే కావడం గమనార్హం.

6.22 లక్షల మంది పిల్లలను పట్టించుకోరా?:
రాష్ట్రంలో రెండేళ్ల తర్వాత ఈ సంవత్సరమే పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 6,22,537 మంది పరీక్షలు రాసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో అధికార యంత్రాంగం ఎంత శ్రద్ధ తీసుకోవాలి? ఏ చిన్న తప్పిదం జరిగినా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడికి గురవుతారన్న అంశానికి ఎంత ప్రాధాన్యమివ్వాలి? కానీ... ఇవేమీ పట్టించుకున్న దాఖలాలే కనిపించడం లేదు. రాజకీయ కారణాలతో వాయిదా వేసిన అధికార యంత్రాంగం దాన్నుంచి తప్పించుకునేందుకు సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయని అనధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం ఫలితాలను అయిదు రోజుల క్రితమే సిద్ధం చేసింది. రెండు రోజులు ముందుగానే మంత్రి అనుమతికి దస్త్రం పంపింది. ఫలితాలకు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని పరీక్షల విభాగం అధికారులే పేర్కొంటున్నారు. ఒకవేళ సాంకేతిక సమస్యలే అనుకుంటే సంబంధిత తనిఖీలు చేసుకోకుండానే తేదీలను ప్రకటించేశారా? ఒకవేళ సాంకేతిక సమస్యలు ఏర్పడితే ఉదయమే వాయిదా వేస్తున్నట్లు సమాచారం ఇవ్వొచ్చు కదా? ఫలితాల ప్రకటన సమయం ముగిసిన 20 నిమిషాల తర్వాత వాట్సప్‌లో సమాచారం పంపించడమేంటి? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

కెమెరాలొచ్చాయ్‌.. ఫలితాలు రాలేదు!

.

పదో తరగతి ఫలితాలు శనివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ముందే ప్రకటించారు. ఆ మేరకు విజయవాడలో బందరు రోడ్డులోని ఆర్‌అండ్‌బీ బిల్డింగ్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మీడియాకూ సమాచారం ఇచ్చారు. దీంతో శనివారం మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లి మీడియా పాయింట్‌ వద్ద కెమెరాలు పొజిషన్‌లో పెట్టుకొని, కవరేజ్‌ కోసం సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇక్కడ మీడియా ప్రతినిధుల నిరీక్షణ కొనసాగుతుండగా.. 11.20కి ‘అనివార్య కారణాల వల్ల ఫలితాలు వాయిదా వేస్తున్నాం’ అని అధికారులు తాపీగా ప్రకటించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 5, 2022, 5:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.