కరోనాపై పోరాటంలో విరాళాల ద్వారా పౌరులు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిలుపిచ్చింది. ప్రభుత్వం చేపడుతున్న నివారణ చర్యలకు మద్దతుగా నిలవాలని కోరింది. పలు సంస్థలు సామాజిక బాధ్యత కింద వెచ్చించే నిధులను ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకు అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆయా విరాళాలను కంపెనీల చట్టంలోని నిర్దేశిత నిబంధనల మేరకు సామాజిక బాధ్యత విరాళాలుగా పరిగణిస్తామని తెలిపారు. ఎం.జి. రోడ్ బ్రాంచ్, విజయవాడలోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పేరిట ఉన్న ఖాతాకు విరాళాలు జమ చేయాల్సి ఉంటుందన్నారు.
విరాళాలను పంపించాల్సిన ఖాతా వివరాలు:
ఖాతా నెంబరు: 36897128069 |
ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN 0016857 |
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ |
ఎం.జి. రోడ్ బ్రాంచ్ |
విజయవాడ |
ఇవీ చదవండి: