కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌తో ఏపీ నీటి సంఘాల ప్రతినిధుల భేటీ అయ్యారు. హైదరాబాద్ జలసౌధలో బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్‌ను కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టు నీటి సంఘాల ప్రతినిధులు కలుసుకున్నారు. తెలంగాణ తీరుతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఫిర్యాదు చేశారు. సమాఖ్య ప్రతినిధులు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ వినతి పత్రం అందించారు.
తెలంగాణ ప్రభుత్వం అనుమతి లేకుండా నిర్మిస్తున్న పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను ఆపాలని.. ఉమ్మడి జలాశయాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య కోరింది. తెలంగాణ ప్రభుత్వం 255 టీఎంసీల సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టిందని.. వాటితో ఏపీలోని 30 లక్షల ఎకరాలు బీళ్లుగా మారతాయని ఆవేదన చెందారు. పాలమూరు - రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కొత్తవేనని కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసిందని.. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ఈ అంశాలపై చర్చించాలని కోరారు.
సాగర్ కాల్వలకు నీరు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరిట కృష్ణా జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తి ఆపి ఆంధ్రప్రదేశ్ రైతుల ప్రయోజనాలు కాపాడాలని కోరారు.
ఇదీ చదవండి: