ETV Bharat / city

'సిద్దిపేట చాలా బాగుంది.. నా ప్రొద్దుటూరు ఇంత బాగాలేదు' - సిద్దేపేటలో ప్రొద్దుటూర్​ ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి పర్యటన

తెలంగాణలోని సిద్దిపేట అభివృద్ధిపై.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి ప్రశంసలు కురిపించారు. నిజం చెప్పాలంటే తన నియోజకవర్గం ఇంత బాగోలేదన్నారు. ప్రస్తుతం ఏపీలో తాము అధికారంలో ఉన్నామని.. హరీశ్​రావును ఆదర్శంగా తీసుకొని.. ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తానన్నారు.

proddatur mla siva prasad reddy siddipet tour
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి
author img

By

Published : Mar 26, 2021, 5:34 PM IST

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి

తెలంగాణలోని సిద్దిపేటను అభివృద్ధి చేసిన మంత్రి హరీశ్​రావును ఆదర్శంగా తీసుకొని తన నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి తెలిపారు. డబుల్​ బెడ్​రూం ఇళ్ల నిర్మాణం గురించి ఏపీ ముఖ్యమంత్రి జగన్​ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

సిద్దిపేట పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శివప్రసాద్​రెడ్డి.. పట్టణంలోని నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్​ను పరిశీలించారు. మార్కెట్లో దుకాణదారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్​రూం ఇళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్​ కమిషనర్​ రాధ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేటలో చాలా అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​, రైతు బజార్​, డబుల్ బెడ్ రూం ఇళ్లు చాలా బాగున్నాయి. ఒక కుటుంబానికి సరిపడా విధంగా నిర్మించారు. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గురించి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తా. నా నియోజకవర్గంలో 24 వేల ఇళ్లు నిర్మిస్తున్నా.. అందుకే సిద్దిపేటలో డబుల్​ బెడ్​రూం ఇళ్లు చూసేందుకు వచ్చా. సిద్దిపేట పట్టణం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే నా పొద్దుటూరు నియోజకవర్గం ఇంత బాగోలేదు. ఏపీలో ప్రస్తుతం మా ప్రభుత్వం ఉంది. హరీశ్​రావును ఆదర్శంగా తీసుకొని.. సిద్దిపేటలా.. ప్రొద్దుటూరును అభివృద్ధి చేస్తా. తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. - శివప్రసాద్​రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే,కడప జిల్లా

ఇవీచూడండి:

'ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.