పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఇతర అధికారులను కలిసేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌లు దిల్లీ వెళ్లారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.47,725 కోట్ల నిధులు అవసరమని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం సిఫార్సు చేస్తూ కేంద్ర జలవనరులశాఖకు సమావేశం మినిట్స్ పంపింది.
అదే సమయంలో రూ20,398.61 కోట్లతో పాతధరలు, పాత అంచనాలకూ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి షెకావత్‌ను, ఇతర ఉన్నతాధికారులను కలిసి సానుకూలంగా చర్యలు తీసుకునే విషయం మాట్లాడేందుకు వీరు దిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి దిల్లీలో లేరని సమాచారం. మరోవైపు కేంద్ర జలశక్తిశాఖలో జాయింట్ సెక్రటరీని కలిసి వీరు మాట్లాడినట్లు తెలిసింది. మంగళవారం సైతం ఈ బృందం దిల్లీలోనే ఉండనుంది.
ఇదీ చదవండి: రాష్ట్రానికీ నివర్ ముప్పు... చిత్తూరు జిల్లాను తాకనున్న తీవ్ర తుపాను