కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమలవుతున్న లాక్‌డౌన్‌కు 90 శాతం జనం సహకరిస్తున్నారు. అయితే 10 శాతం మంది మాత్రం అవసరం లేకపోయినా సరే రోడ్లపై తిరుగుతున్నారు. ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఇళ్లకు మరిమితమవుతున్నా... కొందరు మాత్రం నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తున్నారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల కొనుగోలు, అత్యవసర పనులపై మినహా జనాలు బయటకు రావొద్దని చెబుతున్నా, కొందరు అవేవి చెవికెక్కించుకోవట్లేదు. బజార్లు తెరిచి ఉంచే సమయాన్ని మధ్యాహ్నం 1 గంట వరకూ పెంచడం, అనేకచోట్ల సామాజిక దూరం పాటించేలా ముగ్గుపిండితో గడులు గీయడంతో వస్తువుల కోసం ఒకేసారి ఎగబడటం, గుమిగూడటం వంటి పరిస్థితుల్లో గురువారం చాలా మార్పు కనిపించింది.
ఇవీ చదవండి: 'క్రమశిక్షణతో ఎదుర్కొందాం... లేకుంటే తప్పదు మూల్యం'