పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై వివాదం ముదురుతోంది. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు దస్త్రాన్ని శాసన మండలి కార్యదర్శి తిప్పి పంపడంపై ఛైర్మన్ షరీఫ్ ఆగ్రహం వ‌్యక్తంచేశారు. వెంటనే సెలెక్ట్ కమిటీ ఏర్పాటుచేసి తనకు నివేదించాలని మండలి కార్యదర్శిని ఆదేశించారు. జాప్యం ఇంకా కొనసాగితే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని షరీఫ్ హెచ్చరించారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై సెలెక్ట్ కమిటీ సభ్యులను ఇప్పటికే ఖరారు చేసిన మండలి ఛైర్మన్ షరీఫ్.. తదనుగుణంగా బులెటిన్ విడుదల చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. అయితే, సదరు నిబంధన ప్రకారం కుదరదంటూ.. మండలి కార్యదర్శి దస్త్రాన్ని వెనక్కిపంపారు. ఈ పరిణామాలు సభా ధిక్కారమేనని విపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో ఛైర్మన్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు.
ఇవీ చదవండి.. పంచాయతీలకు పార్టీ రంగులపై హైకోర్టు విచారణ