ETV Bharat / city

రేపటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు

మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ రాజీనామాతో ఖాళీ అయిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నామినేషన్ల గడువు గురువారంతో ముగియనుంది. ఇప్పటివరకూ నామినేషన్లు దాఖలు కాలేదు. డొక్కా మాణిక్య వరప్రసాద్ పేరును వైకాపా ఖరారు చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో శాసన మండలిలో డొక్కా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

AP legislative council bypoll to be held on July 6

author img

By

Published : Jun 24, 2020, 9:38 PM IST

Updated : Jun 24, 2020, 10:36 PM IST

ఏపీలో ఖాళీ అయిన శాసన సభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక కోసం జూన్ 18న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఇచ్చింది. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 6న ఓటింగ్ జరగనుంది. అదేరోజు సాయంత్రం లెక్కింపు చేయనున్నారు.

డొక్కా ఎందుకు రాజీనామా చేశారంటే..

రాజధాని బిల్లుల సమయంలో ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేశారు. తెదేపా ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేస్తూ.. లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. భవిష్యత్​లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. అనంతరం ఆయన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీ నుంచి పోటీ లేకుంటే ఆయన ఎన్నిక ఏకగ్రీవమే అవుతుంది.

ఇదీ చదవండి: మండలి వ్యవహారంపై ఛైర్మన్​కు వైకాపా ఫిర్యాదు?

Last Updated : Jun 24, 2020, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.