పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు శివనాథరెడ్డి, పోతుల సునీతల అనర్హత పిటిషన్‌పై ఈనెల 15న.. శాసన మండలి ఛైర్మన్ షరీఫ్ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు విచారణకు హాజరు కావాలని శాసనపరిషత్ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు.. ఫిర్యాదు చేసిన వారికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి లేఖల ద్వారా సమాచారం పంపారు.
జనవరిలో జరిగిన శాసనమండలి సమావేశాల్లో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి తెదేపా ఎమ్మెల్సీలందరికీ విప్ జారీ చేసింది. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌పై జరిగిన ఓటింగ్‌లో ఎమ్మెల్సీలు శివనాథ రెడ్డి, పోతుల సునీతలు పార్టీ జారీ చేసిన విప్‌నకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, అశోక్ బాబు శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌నకు ఫిర్యాదు చేశారు. దీనిపై మూడో విచారణకు రావాలని ఆదేశించగా పోతుల సునీత, శివనాథ రెడ్డిలు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో జూన్ 15వ తేదీ ఉదయం 11 గంటలకు శాసనమండలి ఛైర్మన్ ఛాంబర్‌లో తదుపరి విచారణ చేపట్టనున్నారు.
ఇదీ చూడండి..