రాష్ట్రంలో కొత్త బార్ల విధానంలో భాగంగా 2022 వరకు గడువున్న బార్ల లైసెన్సులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై... హైకోర్టు స్టే విధించింది. కొత్త బార్ల లైసెన్సుల జారీ ప్రక్రియను.. నిలువరించింది. దశల వారీగా మద్య నిషేదం చర్యల్లో భాగంగా నూతన బార్ల విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం... బార్లు, రెస్టారెంట్ల లైసెన్సులను ఈ ఏడాది చివరితో ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిపై బార్లు, రెస్టారెంట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వ ఉత్తర్వులు సరికాదు
రాష్ట్రంలో ఐదేళ్లకు లైసెన్సు మంజూరు చేస్తూ 2017లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారని, ఆ గడువు తీరక ముందే సర్కారు లైసెన్సు ఉపసంహరించడం సరికాదని బార్ల యజమానులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆ అధికారం ప్రభుత్వానికి లేదని వాదించారు. అయితే ప్రజాహితాన్ని దృష్టిలో ఉంచుకుని.. బార్ల సంఖ్య తగ్గించాలనే ఉద్దేశంతో లైసెన్సులు ఉపసంహరించామని ప్రభుత్వ ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.
ముందుగా నోటీసులివ్వాల్సింది
బార్ల సంఖ్య తగ్గించాలనుకున్నప్పుడు ముందుగా కొన్నింటిని గుర్తించి...యజమానులకు నోటీసులు ఇవ్వాల్సిందన్న హైకోర్టు.. మొత్తం లైసెన్సులు ఒకేసారి ఉపసంహరించుకోవడం సరికాదని పేర్కొంది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
ఇవీ చూడండి: