న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టింగులు పెట్టి చర్చలు జరిపిన 93 మందికి సంబంధించిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు ప్రత్యక్ష విచారణ జరపనుంది. నేరుగా విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యాక ఈ వ్యాజ్యాన్ని కేసులు జాబితాలో వచ్చేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని న్యాయస్థానం సోమవారం ఆదేశించింది.
వైకాపా ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌తోపాటు పలువురు న్యాయవాదులు, జర్నలిస్టులు ఈ కోర్టు ధిక్కరణ జాబితాలో ఉన్నారు. తాజాగా ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం ప్రతివాదులు ఎక్కువ మంది ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కష్టమని నేరుగానే విచారిస్తామని తెలిపింది.
ఇదీ చదవండి