రాష్ట్రంలో ఏపీ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. 2017లో మానవ హక్కుల కమిషన్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని 2017లో నోటిఫికేషన్ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హెచ్ఆర్సీని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. కేబినెట్ తీర్మానంతో నోటిఫికేషన్‌ను మారుస్తున్నామన్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: